Chinese Custody: అరుణాచల్ ప్రదేశ్ యువకుడికి చైనా కస్టడీలో ఎలక్ట్రిక్ షాక్!
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఇండియన్ టీనేజర్‌ను కిడ్నాప్ చేసి కొద్ది రోజుల తర్వాత విడుదల చేసింది చైనీస్ ఆర్మీ. మిరామ్ తారోన్ అనే యువకుడిని...

Arunachal
Chinese Custody: అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఇండియన్ టీనేజర్‌ను కిడ్నాప్ చేసి కొద్ది రోజుల తర్వాత విడుదల చేసింది చైనీస్ ఆర్మీ. మిరామ్ తారోన్ అనే యువకుడిని సియాంగ్ జిల్లాలోని ట్యూటింగ్ ప్రాంతంలో పేరెంట్స్ కు అప్పగించామని జిల్లా డిప్యూటీ కమిషనర్ శాస్వత్ సౌరభ్ వెల్లడించారు.
స్థానిక అధికారులు, పంచాయతీ లీడర్లు ఇంటికి తిరిగొచ్చిన సందర్భంగా స్వాగతం పలికారు.
జనవరి 18న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద లుంగ్తా జార్ ప్రాంతంలో మిరామ్ (17)ను చైనీస్ ఆర్మీ కిడ్నాప్ చేసింది. స్నేహితుడు జానీ యాయింగ్ తో కలిసి వేటకు వెళ్లిన వ్యక్తి అప్పటి నుంచి కనపడలేదు. దాదాపు వారానికి పైగా ఎదురుచూసిన కుటుంబానికి జనవరి 27న క్వారంటైన్ పూర్తి చేసుకుని లీగల్ ఫార్మాలిటీల తర్వాత ఇంటికి వచ్చాడు.
Read Also : ఉబ్బసంతో ఉక్కిరిబిక్కిరి….జాగ్రత్తలు తప్పనిసరి
ఈ ఘటన మొత్తంలో మిరామ్ మానసికంగా కుంగిపోయాడని, భయపడుతున్నాడంటూ అతని తండ్రి ఒపాంగ్ తారోన్ చెప్తున్నారు. చైనా ఆర్మీ కస్టడీలో ఉన్న సమయంలో కట్టేసి ఉండటంతో పాటు కళ్లకు గంతలు కట్టి ఉంచారట.
‘ఇప్పటికీ అతను షాక్ లోనే ఉన్నాడు. స్టార్టింగ్ లో అతనికి ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇచ్చారు. వీపు భాగంలో తన్నారు. ఇతర ప్రాంతాలకు తరలించే సమయంలో చేతులు కట్టేసి కళ్లకుగంతలు కట్టారు. వదిలిపెట్టే ముందే అతనికి తింటిపెట్టారు’ అని అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. .