UN Trust Fund: ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు యూఎన్ ట్రస్ట్ ఫండ్‌కు భారత్ భారీగా విరాళం ..

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సభ్యదేశాల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి (యూఎన్) ట్రస్ట్ ఫండ్ ఫర్ కౌంటర్ టెర్రరిజంకు భారత్ 500,000 డాలర్లు అందించనున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం ప్రకటించారు.

UN Trust Fund: ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు యూఎన్ ట్రస్ట్ ఫండ్‌కు భారత్ భారీగా విరాళం ..

minister Jaishankar

Updated On : October 29, 2022 / 1:28 PM IST

UN Trust Fund: ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సభ్యదేశాల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి (యూఎన్) ట్రస్ట్ ఫండ్ ఫర్ కౌంటర్ టెర్రరిజంకు భారత్ 500,000 డాలర్లు అందించనున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం ప్రకటించారు. న్యూఢిల్లీలో ఉగ్రవాద నిరోధక కమిటీ (సీటీసీ) ప్రత్యేక సమావేశంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్లీనరీ సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో సినీ హీరోయిన్ పూనమ్‌కౌర్.. వారి సమస్యలపై రాహుల్‌తో చర్చ

ఉగ్రవాద ముప్పును నిరోధించడంలో, ఎదుర్కోవడంలో సభ్యదేశాలకు సామర్థ్యాన్ని పెంపొందించే మద్దతును అందించడంలో కౌంటర్ – టెర్రరిజం కార్యాలయం ప్రయత్నాలను పెంపొందించడానికి భారతదేశం ఈ సంవత్సరం యూఎన్ ట్రస్ట్ ఫండ్ ఫర్ కౌంటర్ టెర్రరిజంకు స్వచ్ఛందంగా అర మిలియన్ డాలర్లను అందజేయనుందని మంత్రి అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం కొత్త, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వల్ల కలిగే ముప్పు గురించి జైశంకర్ హెచ్చరించారు.

CM Gehlot: ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న ఫాసిస్టు పార్టీ బీజేపీ.. రాజస్తాన్ సీఎం గెహ్లాట్

బెదిరింపులను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు సమాజాలను అస్థిరపరిచే లక్ష్యంతో ప్రచారం, రాడికలైజేషన్, కుట్ర సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి ఉగ్రవాద, మిలిటెంట్ గ్రూపుల టూల్‌కిట్‌లో శక్తివంతమైన సాధనాలుగా మారాయని ఆయన తన ప్రధాన ప్రసంగంలో పేర్కొన్నాడు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి గత రెండు దశాబ్దాలుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గణనీయమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉగ్రవాద ముప్పు పెరుగుతోందని జైశంకర్ నొక్కిచెప్పారు. ఈ సాంకేతికతలలో కొన్ని స్వభావాలు, నూతన నియంత్రణ వాతావరణం కారణంగా సాంకేతికతలు ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలకు కొత్త సవాళ్లను కూడా విసురుతున్నాయని జైశంకర్ అన్నారు.

IndiGo Aircraft: టేకాఫ్ సమయంలో ఇండిగో విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు

ఇదిలాఉంటే 2008లో 140 మంది భారతీయులు, 26 మంది విదేశీయులు మరణించిన పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు జరిపిన భీకర దాడికి సాక్షిగా ముంబైలో శుక్రవారం ప్రత్యేక సదస్సు ప్రారంభమైంది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వెలుపల ఇలాంటి సదస్సు జరగడం ఇదే తొలిసారి.