India Population: జనాభాలో చైనాను దాటేశాం.. ప్రస్తుతం ఇండియా జనాభా ఎంతంటే..?

2022 డిసెంబర్ 31 నాటికి చైనా జనాభా 141.2 కోట్లని చైనా మంగళవారం అధికారికంగా ప్రకటించిన విషయం విధితమే. అదే రోజున భారత్ జనాభా 141.7 కోట్లకు చేరిందని డబ్ల్యూపీఆర్ సంస్థ అంచనా వేసింది. అయితే, ఆ సంఖ్య బుధవారం నాటికి 142.3 కోట్లకు ఎగబాకిందని చెప్పింది

India Population: జనాభాలో చైనాను దాటేశాం.. ప్రస్తుతం ఇండియా జనాభా ఎంతంటే..?

India populetion

Updated On : January 19, 2023 / 7:23 AM IST

India Population: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదంటే నిన్నటి వరకు చైనా అని చెప్పుకునేవాళ్లం. ఇకనుంచి ఆ పేరు కనుమరుగవుతోంది. తెరపైకి భారత్ దేశం వచ్చిచేరింది. తాజాగా వరల్డ్ పాపులేషన్ రివ్యూ (డబ్ల్యూపీఆర్) నిర్వహించిన సర్వేలో చైనా జనాభాకంటే భారత దేశం జనాభా ఎక్కువని అంచనా వేసింది. గత ఏడాది డిసెంబర్ నెల నాటికి డబ్ల్యూపీఆర్ అంచనా ప్రకారం.. చైనా కంటే భారత్ లో 50లక్షల మంది అధికంగా జనాభా ఉందని అంచనా వేసింది. అయితే, మన దేశ జనాభాపై అధికారికంగా తాజా గణాంకాలు అందుబాటులో లేవు. పదేళ్లకోసారి ఆనవాయితీ ప్రకారం మన దేశంలో జనాభా గణన జరగాలి. కానీ, 2020లో కరోనా కారణంగా జనాభా గణన వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో అధికారికంగా ప్రస్తుతం భారతదేశ జనాభా గణాంకాలు అందుబాటులో లేవు. పలు సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ మొదటి స్థానంకు చేరిందని అంచనా వేస్తున్నాయి.

India Most Population : వచ్చే ఏడాది నాటికి చైనాను దాటేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌!

2022 డిసెంబర్ 31 నాటికి చైనా జనాభా 141.2 కోట్లని చైనా మంగళవారం అధికారికంగా ప్రకటించిన విషయం విధితమే. అదే రోజున భారత్ జనాభా 141.7 కోట్లకు చేరిందని డబ్ల్యూపీఆర్ అంచనా వేసింది. అయితే, ఆ సంఖ్య బుధవారం నాటికి 142.3 కోట్లకు ఎగబాకిందని చెప్పింది. డబ్ల్యూపీఆర్ అంచనాకు సమానంగా.. మాక్రోట్రెండ్స్ అనే సంస్థకూడా అదేవిషయాన్ని వెల్లడించింది. ఆ సంస్థ అంచనా ప్రకారం.. బుధవారం నాటికి భారతదేశం జనాభా 142.8కోట్లు. ఇదిలాఉంటే భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటని ప్రపంచ వ్యాప్తంగా పేరుగడిస్తున్న విషయం విధితమే. ఆసియాలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది. అంతేకాక, అనేక విభాగాల్లో ప్రపంచంలో భారత్ రెండుమూడు స్థానంలో ఉంది. ఈ క్రమంలో జనాభా విషయంలోనూ ప్రపంచంలో మొదటి స్థానంకు భారత్ చేరినట్లు సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి.

China Population : చైనాలో వేగంగా తగ్గిపోతున్న జనాభా..ఫలితంగా..రోజు రోజు పడిపోతున్న ఉత్పాదక శక్తి

1961 తర్వాత తొలిసారిగా 2022లో తమ దేశంలో జనాభా తొలిసారిగా 8.5లక్షల మేరకు తగ్గుదల నమోదైనట్లు చైనా గత రెండు రోజుల క్రితం ప్రకటించింది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచనా ప్రకారం.. ప్రస్తుతం చైనా జనాభా కంటే భారత్ జనాభా 50లక్షలు ఎక్కువ. అయితే, భారతదేశంలో ప్రస్తుతం 50శాతం జనాభా 30ఏళ్లలోపు వారే. ఈ కారణంగా 2050 నాటికి జనాభా ఇలా పెరుతూనే ఉంటుందని డబ్ల్యూపీఆర్ అంచనా వేసింది.