PM Modi Mann Ki Baat: అంతరిక్ష రంగంలో భారత్ అద్భుతాలు చేస్తోంది.. ఇస్రోను ప్రశంసించిన ప్రధాని మోదీ

పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన 'మిషన్ లైఫ్' ప్రచారం గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. ప్రచారాన్ని తెలుసుకోవాలని, మద్దతు ఇవ్వాలని ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.

PM Modi Mann Ki Baat: అంతరిక్ష రంగంలో భారత్ అద్భుతాలు చేస్తోంది.. ఇస్రోను ప్రశంసించిన ప్రధాని మోదీ

PM Modi

Updated On : October 30, 2022 / 1:54 PM IST

PM Modi Mann Ki Baat: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’ 94వ ఎడిషన్ లో జాతినుద్దేశించి ప్రసంగించారు. తొలుత ఛత్ పూజ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఛత్ పూజ సందర్భం మన జీవితంలో సూర్యుని, సౌరశక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుందని అన్నారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ. భారతదేశం ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో తన సంప్రదాయ అనుభవాలను ప్రవేశపెడుతోందని, అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తిదారుల్లో ఒకటిగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశంలో సౌరశక్తి గ్రామాల నిర్మాణం ఒక పెద్ద సామూహిక ఉద్యమంగా మారేరోజు ఎంతో దూరంలో లేదని మోదీ అన్నారు.

Mann ki Baat: ఛండీఘడ్ ఎయిర్‌పోర్ట్ పేరు మార్పు.. భగత్ సింగ్ పేరుతో నామకరణం.. ‘మన్ కీ బాత్’లో మోదీ వెల్లడి

భారతీయ శాస్త్రవేత్తలు సాంకేతికతను స్వతహాగా అభివృద్ధి చేశారని, ఇప్పుడు డజన్ల కొద్దీ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారని, ఈ ప్రయోగంతో భారతదేశం ప్రపంచ వాణిజ్య మార్కెట్‌లో బలమైన దేశంగా ఉద్భవించిందని అన్నారు. ఇది అంతరిక్ష రంగంలో భారతదేశానికి కొత్త అవకాశాలను కూడా తెరిచిందని ఇస్రో ఇటీవలి వాణిజ్య ఉపగ్రహాన్ని ప్రయోగించడం గురించి ప్రస్తావిస్తూ మోదీ అన్నారు.

ఇంతకుముందు భారతదేశంలోని అంతరిక్ష రంగం ప్రభుత్వ వ్యవస్థల పరిధిలోనే పరిమితం చేయబడింది. ఈ అంతరిక్ష రంగం భారతదేశంలోని యువతకు, భారతదేశంలోని ప్రైవేట్ రంగానికి అందుబాటులోకి తెచ్చినప్పుడు దానిలో విప్లవాత్మక మార్పులు రావడం ప్రారంభించాయని ప్రధాన మంత్రి తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన ‘మిషన్ లైఫ్’ ప్రచారం గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. ప్రచారాన్ని తెలుసుకోవాలని, మద్దతు ఇవ్వాలని ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.