Republic Day 2024: అదో చరిత్ర.. చేతితో రాసిన అతి పెద్ద రాజ్యాంగం మనదే.. ఇంకా ఎన్నో విశేషాలు
ఆనాటి నుండి భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

Republic Day 2024
భారతదేశం 200 సంవత్సరాల బ్రిటీష్ పాలన నుండి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న అనంతరం మరో ఘనతను సాధించింది. అదే భారతరాజ్యం ఆవిష్కరణ. అదే భారత గణతంత్ర దినోత్సవం అమలులోకి వచ్చిన దినోత్సవం (రిపబ్లిక్ డే ) 1950, జనవరి 26 .
ఆనాటి నుండి భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. అందుకే ఏటా జనవరి 26న రిపబ్లిక్ డే జరుపుకుంటాం. మరి అంతటి ఘన చరిత్ర వున్న రాజ్యాంగం చరిత్ర.. దానికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపైనా వుంది.
ఈ విషయాలు తెలుసా?
- 1950 జనవరి 26వ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
- మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి సుమారు రూ.64 లక్షలు ఖర్చు అయ్యింది.
- ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత (చేతితో రాసినది) రాజ్యాంగం మన భారతదేశానిదే
- రాజ్యాంగాన్ని రాసేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది.
- డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అధ్యక్షుడిగా రూపొందిన రాజ్యాంగ 1947లో ముసాయిదా కమిటీ ఏర్పడింది.
- రాజ్యాంగం మొత్తాన్ని చేతి రాతతోనే రాశారు. ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్‌జాదా.. ఇటాలిక్ కాలిగ్రఫీ స్టైల్‌లో రాశారు.
- ప్రతి పేజీనీ కొందరు కళాకారులు అందంగా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో చేతిరాతతో రాశారు.
- ‘భారత దేశ ప్రజలమైన మేము’ అనే ప్రవేశికతో మొదలయ్యే మన రాజ్యాంగం.. అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్ 8 షెడ్యూల్స్, 22 భాగాలుగా ఉంది.
- ఈ క్రమంలో రాజ్యాంగ రూపొందించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ న పార్లమెంటు భవనంలోని గ్రంథాలయంలో హీలియం వాయువు నింపిన బాక్స్ లో భద్రపరిచారు.
- మన రాజ్యాంగాన్ని ‘బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్’ అని కూడా సరదాగా పిలుచుకుంటుంటారు.
- రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది.
- రాజ్యాంగ రాతప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది.
- రాజ్యాంగంపై సంతకాలు చేసే రోజున బయట చిరుజల్లు పడుతూ ఉంది. దీన్ని శుభశకునంగా భావించారు.
- జపాన్, ఐర్లాండ్ ఇంగ్లండ్, యూఎస్‌ఏ, ఫ్రాన్స్.. లాంటి దేశాల రాజ్యాంగాల నుంచి కొన్ని అంశాల్ని తీసుకుని భారతదేశ పరిస్థితులకు అన్వయించేలా మరింత దీర్ఘ సమాచారంతో.. పరిశోధనతో మన రాజ్యాంగం రూపొందింది. అందుకే రాజ్యాంగాన్ని ‘బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్’ అంటారు.
- రాజ్యాంగం రాయడం 1949 నవంబరు 26వ తేదీ నాటికి పూర్తయ్యింది.
Republic Day 2024: రిపబ్లిక్ డే.. 1927 నుంచి 1949 వరకు ఏం జరిగిందో తెలుసా?