ఈ సారి పక్కా కొడతాం : 2020లో చంద్రయాన్-3 లాంఛ్

  • Published By: venkaiahnaidu ,Published On : December 31, 2019 / 01:23 PM IST
ఈ సారి పక్కా కొడతాం : 2020లో చంద్రయాన్-3 లాంఛ్

Updated On : December 31, 2019 / 1:23 PM IST

2020లో భారత్ మూడవ మూన్ మిషన్ ను లాంఛ్ చేయబోతుందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. కేవలం ల్యాండర్, రోవర్‌తో చంద్రయాన్ -3 చంద్రునిపై మళ్లీ సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుందని మంగళవారం(డిసెంబర్-31,2019)మంత్రి తెలిపారు. 2020లో ల్యాండర్,రోవర్ మిషన్ సక్సెస్ అయి తీరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తాను గతంలో చెప్పినట్లుగా చంద్రయాన్-2 మిషన్ ఫెయిల్యూర్ గా చూడకూడదని,దాని నుంచి చాలా నేర్చుకున్నామని జితేంద్రసింగ్ అన్నారు. ప్రపంచంలో ఏ దేశం కూడా మొదటిప్రయత్నంలో ల్యాండింగ్ జరగలేదని,అమెరికాకు చాలాసార్లు ప్రయత్నాల తర్వాతనే ల్యాండింగ్ జరిగిందన్నారు. కానీ భారత్ కు చాలా ప్రయత్నాలు అవసరం లేదన్నారు.

చంద్రయాన్-2 మిషన్ సెలిస్టియల్(ఖగోళ)బాడీపై దిగడానికి భారతదేశం చేసిన మొదటి ప్రయత్నం. రెండు అగ్ని పర్వతాల మధ్యలోనున్న ఎత్తైన ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసే విధంగా ప్లాన్ చేశారు. సెప్టెంబరు 7న తెల్లవారుజామున 1:38 గంటలకు ల్యాండర్ విక్రమ్ సేఫ్ ల్యాండింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. కక్ష్య నుంచి చంద్రుడిపై దిగే ప్రక్రియ 1:48 గంటలకు ల్యాండర్ ఫైన్ బ్రేకింగ్ వరకూ రాగలిగాం. లోకల్ నావిగేషన్ అందుకోవడానికి ఇంకా 2 నిమిషాల సమయం మాత్రమే ఉంది. కానీ, అనుకున్నట్లు జరగలేదు. పథకం ప్రకారం జరిగితే 1:52 గంటలకు ల్యాండర్ చంద్రుడి తొలి చిత్రాన్ని భూమికి పంపించి ఉండేది. మరునిమిషమే 1:53కి ల్యాండర్ చంద్రుడిపై సేఫ్‌గా దిగేది. కానీ దిగాల్సిన చోటుకు 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే ల్యాండర్ సిగ్నల్స్ కట్ అయ్యాయి. 

ఎంచుకున్న ప్రదేశానికి 500మీటర్ల దూరంలో విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ జరిగింది. దీనిని జితేంద్రసింగ్ పార్లమెంట్ లో అధికారికంగా కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ ల్యాండింగ్ విజయవంతం అయితే చంద్రుడి దక్షిణ దృవం వైపు ల్యాండ్ చేసిన మొదటి దేశంగా భారత్ లో నిలిచేది. మరోవైపు 2020కి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది భారత అంతరిక్ష సంస్థ(ISRO). కొత్త శిఖరాలను అధిరోహించాలని నిర్ణయించిన ఇస్రో వచ్చే ఏడాది డజనకు పైగా ముఖ్యమైన శాటిలైట్ లను లాంఛ్ చేయాలని నిర్ణయించింది. ఇందులో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆదిత్య(సన్)మిషన్ కూడా ఉంది.