Corona Virus: కరోనాలో ఇండియా ప్రపంచ రికార్డు, ఒక్కరోజే 4లక్షలు

మహారాష్ట్రలో, కర్ణాటక, యూపీ, కేరళలో. రాజస్థాన్‌, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, బిహార్‌లలో ..

Corona Virus: కరోనాలో ఇండియా ప్రపంచ రికార్డు, ఒక్కరోజే 4లక్షలు

Corona Virus India

Updated On : May 2, 2021 / 7:31 AM IST

Corona Virus: భారత్‌లో కరోనా ఉధృతంగా మారుతోంది. మహమ్మారిని ధాటి ప్రళయంగా విరుచుకుపడుతున్న కొవిడ్ ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా అనేకచోట్ల కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. మరోవైపు టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నా వైరస్‌ వ్యాప్తి వేగం తగ్గడం లేదు.

గతంలో ఎన్నడూ లేనంతగా శుక్రవారం 4లక్షలకు పైగా నమోదైన కేసులు వణుకుపుట్టిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం.. దేశ వ్యాప్తంగా ఒక్కరోజే అత్యధికంగా 19.45లక్షల శాంపిల్స్‌ పరీక్షించగా.. 4లక్షల వెయ్యి 993 కొత్త కేసులు నమోదయ్యాయి. 2లక్షల 99వేల 988 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. 3523 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 32.68 లక్షలకు పెరిగిపోయింది. వీటిలో దాదాపు 25.5లక్షలకు పైగా (78.22% కేసులు) కేవలం 11 రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం.

ఆ రాష్ట్రాలివే..
మహారాష్ట్రలో 6.64లక్షల క్రియాశీల కేసులు ఉండగా.. ఆ తర్వాత కర్ణాటక, యూపీ, కేరళలో ఒక్కోచోట 3లక్షలకు పైగా ఉన్నాయి. అలాగే, రాజస్థాన్‌, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, బిహార్‌లలో ఒక్కో రాష్ట్రంలో లక్ష పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

శుక్రవారం దేశ వ్యాప్తంగా నమోదైన మరణాల్లో 76.75శాతం మరణాలు కేవలం పది రాష్ట్రాలివే.
మహారాష్ట్రలో అత్యధికంగా 828మంది
ఢిల్లీలో 375
యూపీ 332
ఛత్తీస్‌గఢ్‌ 269
కర్ణాటక 217
గుజరాత్‌ 173
రాజస్థాన్‌ 155
ఉత్తరాఖండ్‌ 122
జార్ఖండ్‌ 120
తమిళనాడు 113
అదృష్టవశాత్తు నాలుగు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.