Agni Prime: అణ్వాయుధ సామర్థ్యంగల ‘అగ్ని ప్రైమ్’ కొత్త తర ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతం

అణ్వాయుధ సామర్థ్యం ఉన్న అగ్ని ప్రైమ్ కొత్త తర ఖండాంతర క్షిపణి పరీక్షను భారత్‌ విజయవంతంగా చేసింది. ఇవాళ ఉదయం 9.45 గంటలకు ఒడిశా తీరంలో దీన్ని పరీక్షించారు. ఈ పరీక్ష విజయవంతం కావడంతో అగ్ని శ్రేణి క్షిపణుల్లో భారత్ మరో ముందడుగు వేసింది. ఇవాళ నిర్వహించిన ప్రయోగంలో క్షిపణి వెళ్లగలినంత గరిష్ఠ దూరం వెళ్లింది. లక్ష్యాలను కచ్చితత్వంతో, సమర్థంగా ఛేదించిందని అధికారులు తెలిపారు.

Agni Prime: అణ్వాయుధ సామర్థ్యంగల ‘అగ్ని ప్రైమ్’ కొత్త తర ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతం

Agni 5

Updated On : October 21, 2022 / 4:58 PM IST

Agni Prime: అణ్వాయుధ సామర్థ్యం ఉన్న అగ్ని ప్రైమ్ కొత్త తర ఖండాంతర క్షిపణి పరీక్షను భారత్‌ విజయవంతంగా చేసింది. ఇవాళ ఉదయం 9.45 గంటలకు ఒడిశా తీరంలో దీన్ని పరీక్షించారు. ఈ పరీక్ష విజయవంతం కావడంతో అగ్ని శ్రేణి క్షిపణుల్లో భారత్ మరో ముందడుగు వేసింది. ఇవాళ నిర్వహించిన ప్రయోగంలో క్షిపణి వెళ్లగలినంత గరిష్ఠ దూరం వెళ్లింది. లక్ష్యాలను కచ్చితత్వంతో, సమర్థంగా ఛేదించిందని అధికారులు తెలిపారు.

ఆ క్షిపణి లక్ష్యాన్ని ఛేదించిన తీరును, దాని గమనాన్ని రాడార్, టెలీమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థల సాయంతో నమోదు చేసుకున్నామని అన్నారు. మూడు సార్లు కొత్త తర అగ్ని ప్రైమ్ క్షిపణి పరీక్షను నిర్వహించగా అన్ని ప్రయోగాలూ విజయవంతమయ్యాయి. కాగా, వాటిలో ఒక పరీక్ష ఈ ఏడాది జూన్ లో, మరొకటి గత ఏడాది డిసెంబరులో చేపట్టారు.

భూ లేదా సముద్ర ఉపరితలం నుంచి భూ లేదా సముద్ర ఉపరితల లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీనికి ఉంటుంది. 1,000 నుంచి 2,000 కిలోమీటర్ల మధ్య లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదు. అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం దీనికి ఉంది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) దీన్ని అభివృద్ధి చేసింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..