India : కరోనా పంజా, 4 లక్షల మంది మృతి
భారతదేశంలో ఇంకా కరోనా తగ్గుముఖం పట్టలేదు. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ దిక్కుమాలిన వైరస్ తో నాలుగు లక్షల మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో మరో 835 మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు.

India third nation where covid killed over 4 lakh people: భారతదేశంలో ఇంకా కరోనా తగ్గుముఖం పట్టలేదు. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ దిక్కుమాలిన వైరస్ తో నాలుగు లక్షల మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో మరో 835 మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు.
దీంతో మరణాల సంఖ్య 4,00,312కు చేరుకుంది. అమెరికా, బ్రెజిల్ తర్వాత…నాలుగు లక్షలకు పైగా కరోనా మరణాలు నమోదైన దేశంగా భారత్ నిలిచింది. అమెరికాలో అత్యధికంగా 6 లక్షల మందికి పైగానే మరణాలు సంభవించాయి. బ్రెజిల్ లో 5.2 లక్షల మందిని కరోనా వైరస్ బలి తీసుకుంది. మెక్సికలో 2 లక్షల మంది కరోనాతో మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా 10 దేశాల్లో మరణాల సంఖ్య లక్ష దాటింది.
ఇక 24 గంటల్లో భారతదేశంలో 46 వేల మందిలో కరోనా వైరస్ నిర్ధారించారు. 59 వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశ వ్యాప్తంగా…18.80 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 46 వేల 617 మందిలో వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు. 25 రోజులుగా పాజిటివిటీ రేటు 5 శాతానికి దిగువనే ఉండడం కొంత ఊరటనిచ్చే అంశం.
దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.04 కోట్లకు చేరుకుంది. 59 వేల 384 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 2.95 కోట్ల మందికి చేరుకుంది. రికవరీ రేటు 97.01గా ఉంది. మరోవైపు దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. టీకాల లభ్యత, కొత్త టీకాల రాకతో..వ్యాక్సినేషన్ ప్రక్రియ పుంజుకుంది. గురువారం మరో 42.6 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేయగా…దేశ వ్యాప్తంగా 34 కోట్ల మంది టీకాలు తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిస్తోంది.