గుడ్‌న్యూస్‌.. బుల్లెట్‌ ట్రైన్ ప్రాజెక్టులో నెక్స్ట్‌ జనరేషన్‌ ఈ10 షింకాన్సెన్ ట్రైన్‌లు.. జపాన్‌, భారత్‌లో ఒకేసారి.. వావ్..

బీకేసీ నుంచి థానే వరకు 21 కి.మీ పొడవు ఉన్న అండర్‌సీ టన్నెల్ తొలి దశ టన్నెలింగ్ పనులు నిన్నటితో పూర్తయ్యాయి.

గుడ్‌న్యూస్‌.. బుల్లెట్‌ ట్రైన్ ప్రాజెక్టులో నెక్స్ట్‌ జనరేషన్‌ ఈ10 షింకాన్సెన్ ట్రైన్‌లు.. జపాన్‌, భారత్‌లో ఒకేసారి.. వావ్..

Updated On : July 15, 2025 / 2:53 PM IST

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు(508 కి.మీ పొడవు)లో భాగంగా ఈ10 షింకాన్సెన్ ట్రైన్‌లను ప్రవేశపెట్టేందుకు జపాన్ ప్రభుత్వం అంగీకరించింది.

“జపాన్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ స్పిరిట్‌లో భాగంగా ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఈ10 షింకాన్సెన్ ట్రైన్‌లను ప్రవేశపెట్టడానికి జపాన్ ప్రభుత్వం అంగీకరించింది” అని భారతీయ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ10 ట్రైన్‌లు భారత్‌తో పాటు జపాన్‌లో కూడా ఒకేసారి ప్రవేశించనున్నాయి. ప్రస్తుతం జపాన్‌లో ఈ5 ట్రైన్‌లు నడుస్తున్నాయి. ఈ10 ట్రైన్‌లు నెక్ట్స్ జెన్ మోడల్స్‌. మొత్తం 508 కి.మీ లాంగ్ కారిడార్‌ను జపాన్ షింకాన్సెన్ టెక్నాలజీతో అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర సర్కారు తెలిపిన వివరాల ప్రకారం 15 నదులపై బ్రిడ్జ్‌ల పనులు పూర్తయ్యాయి. నాలుగు బ్రిడ్జ్‌ల నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నాయి.

Also Read: కవిత-తీన్మార్ మల్లన్న ఎపిసోడ్‌పై కేసీఆర్, కేటీఆర్ సైలెంట్‌.. ఇందుకేనా?

బీకేసీ-థానే అండర్‌సీ టన్నెల్ తొలి దశ పూర్తి
బీకేసీ నుంచి థానే వరకు 21 కి.మీ పొడవు ఉన్న అండర్‌సీ టన్నెల్ తొలి దశ టన్నెలింగ్ పనులు నిన్నటితో పూర్తయ్యాయి. బుల్లెట్‌ ట్రైన్‌లో భాగంగా ట్రాక్ లేయింగ్, స్టేషన్, బ్రిడ్జ్‌లు, ఓవర్‌హెడ్ ఎలక్ట్రికల్ వైర్‌ల నిర్మాణం వేగంగా సాగుతోందని కేంద్ర సర్కారు చెప్పింది.

ఆపరేషన్, కంట్రోల్ వ్యవస్థల కోసం సిస్టమ్‌ల ప్రొక్యూర్‌మెంట్ కూడా సజావుగా జరుగుతోందని పేర్కొంది. “బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఇటీవల 310 కి.మీ వైడక్ట్ నిర్మాణాన్ని పూర్తిచేసి ఒక ముఖ్యమైన మైలురాయి చేరుకుంది” అని తెలిపింది.

అండర్‌సీ టన్నెల్ విషయంలో బీకేసీ స్టేషన్ ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా నిలుస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. భూమిలో 32.5 మీటర్ల లోతులో ఉండే ఈ స్టేషన్.. గ్రౌండ్ మీద 95 మీటర్ల ఎత్తు ఉండే బిల్డింగ్‌కు సపోర్టుగా ఉంటుందని పేర్కొంది.