India Most Population : వచ్చే ఏడాది నాటికి చైనాను దాటేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌!

అయితే, 2023 నాటికి ఈ ర్యాంకుల్లో కాస్త మార్పు జరగనుందని, చైనాను దాటేసి భారత్‌ అత్యధిక జనాభా గల దేశంగా నిలిచే అవకాశముందని నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం చైనా జనాభా 142.6కోట్లు కాగా.. భారత జనాభా 141.2 కోట్లుగా ఉంది. 2050 నాటికి భారత జనాభా 166.8 కోట్లకు చేరనుందని ఐరాస అంచనా వేసింది.

India Most Population : వచ్చే ఏడాది నాటికి చైనాను దాటేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌!

India Population

Updated On : January 19, 2023 / 12:39 PM IST

India most population : వచ్చే ఏడాది నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌ నిలిచే అవకాశముంది. చైనా జనాభాను భారత్‌ దాటేస్త్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘2022 ప్రపంచ జనాభా అంచనాల’ నివేదికను ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది. ఈ ఏడాది నవంబరు నాటికి ప్రపంచంలోని మొత్తం జనాభా 800 కోట్ల మార్క్‌ను తాకే అవకాశముందని తెలిపింది.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన తొలి రెండు ప్రాంతాలుగా తూర్పు, ఆగ్నేయాసియా ప్రాంతాలు నిలిచాయని నివేదిక వెల్లడించింది. ఈ రెండు ప్రాంతాల్లో మొత్తం 230 కోట్ల జనాభా ఉండగా.. ప్రపంచ జనాభాలో 29శాతం ఇక్కడే నివసిస్తున్నారు. ఇక, 210 కోట్ల జనాభాతో దక్షిణాసియా, మధ్య ఆసియా ప్రాంతాలు తర్వాతి స్థానంలో నిలిచాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు కూడా ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ జాబితాలో చైనా ప్రథమ స్థానంలో ఉండగా.. భారత్‌ రెండో స్థానంలో ఉంది.

Total Global Population on That Day: మీరు పుట్టిన సమయంలో ప్రపంచ జనాభా ఎంతుందో తెలుసా.. ఒక్క క్లిక్ అంతే

అయితే, 2023 నాటికి ఈ ర్యాంకుల్లో కాస్త మార్పు జరగనుందని, చైనాను దాటేసి భారత్‌ అత్యధిక జనాభా గల దేశంగా నిలిచే అవకాశముందని నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం చైనా జనాభా 142.6కోట్లు కాగా.. భారత జనాభా 141.2 కోట్లుగా ఉంది. 2050 నాటికి భారత జనాభా 166.8 కోట్లకు చేరనుందని ఐరాస అంచనా వేసింది. అదే సమయంలో చైనా జనాభా 131.7 కోట్లకు తగ్గే అవకాశముందని తెలిపింది.

ఇక ఈ ఏడాది నవంబరు 15 నాటికి ప్రపంచ జనాభా (World Population) 800 కోట్ల మార్క్‌ను తాకే అవకాశముందని ఐరాస అంచనా వేసింది. 2030 నాటికి ఈ సంఖ్య 850 కోట్లు.. 2050 నాటికి 970 కోట్లకు చేరే అవకాశముందని తెలిపింది. ”ఈ ఏడాది ప్రపంచ జనాభాలో సరికొత్త మైలురాయిని చేరుకోనున్నాం. ఈ ఏడాదిలోనే ఈ భూమ్మీద 800కోట్లవ శిశువు జన్మించే అవకాశముందని అంచనా వేస్తున్నాం. మన వైవిధ్యతను వేడుక చేసుకునే సందర్భం అది.

World Health Day 2022 : మనం పీల్చే గాలి మంచిదేనా? ప్రపంచ జనాభా 99శాతం కలుషితమైన గాలినే పీలుస్తోంది.. WHO కొత్త డేటా!

ఆరోగ్య ప్రమాణాల్లో మరింత పురోగతి సాధిస్తున్నాం. ఆయుర్దాయం పెరుగుతోంది. మాతా, శిశు మరణాల రేట్లు కూడా తగ్గుతున్నాయి” అని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెసర్‌ ఈ సందర్భంగా తెలిపారు. అయితే అదే సమయంలో ఈ భూమండలాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీదా ఉందన్నారు.