India-China : స్వీట్లు పంచుకున్న భారత్-చైనా సైనికులు

నూతన సంవత్సరం సందర్భంగా భారత్​, చైనా సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. తూర్పు లడఖ్ లో ఇరు దేశాల మధ్య సైనిక ప్రతిష్టంభన నెలకొన్న వేళ.. వాస్తవాధీన రేఖ వెంబడి హాట్​ స్ప్రింగ్స్​,

India-China :  స్వీట్లు పంచుకున్న భారత్-చైనా సైనికులు

Sweets 2

Updated On : January 3, 2022 / 10:11 AM IST

India-China : నూతన సంవత్సరం సందర్భంగా భారత్​, చైనా సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. తూర్పు లడఖ్ లో ఇరు దేశాల మధ్య సైనిక ప్రతిష్టంభన నెలకొన్న వేళ.. వాస్తవాధీన రేఖ వెంబడి హాట్​ స్ప్రింగ్స్​, డెమ్​ చోక్​, నాథులా, కోంగ్రా లా ప్రాంతాల్లో చైనా, భారత సైనికులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు.బహుమతులు ఇచ్చి పుచ్చుకున్నారు.

2020 మేలో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ సరిహద్దులో ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సైనికులు పరస్పరం న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ బహుతులు ఇచ్చి పుచ్చుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అంతకుముందు, కొత్త ఏడాది సందర్భంగా భారత్-పాక్ సైనికులు కూడా పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. జమ్ముకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న పూంచ్,రావల్ కోట్,చిల్లియానా తివాల్,చకోటి ఉరి పాయింట్ల వద్ద స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.

ALSO READ Omicron Scare : మేక్ షిఫ్ట్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయండి..రాష్ట్రాలకు కేంద్రం మరో లేఖ