ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్స్ హై అలర్ట్ : సముద్రంలో పెట్రోలింగ్

గుజరాత్ : దాయాది దేశాలైన భారత్-పాక్ ల సరిహద్దుల్లో యుద్ధవాతావరణ నెలకొంది. దీంతో ఇండియన్ నేవీ.. కోస్ట్ గార్డ్స్ హై అలర్ట్ ప్రకటించాయి. ఇప్పటికే పలు సున్నిత ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహారాష్ట్ర, గుజరాత్ కోస్ట్ లైన్ పరిధిలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. నేవీ, కోస్ట్ గార్డ్స్ లు సముద్రంలో తమ పెట్రోలింగ్ ను తీవ్రతరం చేశాయి.
Read Also: భారత్‌పైకి మరోసారి పాక్ యుద్ధ విమానాలు
పెట్రోలింగ్ బలగాల సంఖ్యను కూడా పెంచటం గమనించాల్సిన విషయం. ఈ క్రమంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల డాక్యుమెంట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు, ఆయుధాలతో కూడిన పాకిస్థాన్ సబ్ మెరైన్లు భారత ప్రాదేశిక జలాల్లో నుంచే దాడి చేసే అవకాశం ఉందని… ఈ నేపథ్యంలో, అప్రమత్తంగా ఉండాలని సెక్యూరిటీ ఏజెన్సీలు నేవీ, కోస్ట్ గార్డ్స్ ను హెచ్చరించాయి.
కాగా ఇప్పటికే పాకిస్థాన్ కొన్ని విమానాశ్రయాల్లో నిషేధ ఆజ్క్షలు జారీ చేసింది. లాహోర్, ముల్తాన్, ఫైసలాబాద్, సియాల్‌కోట్, ఇస్లామాబాద్ విమానాశ్రయాలను పాక్ మూసివేసింది. డొమెస్టిక్‌తో పాటు అంతర్జాతీయ ఫ్లైట్లను నిషేధిస్తూ పాక్ ఆదేశాలను జారీ చేసింది. భారత్, పాక్ గగనతలంలో ప్రయాణించే అన్ని అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ప్రభావం పడింది.
Read Also : అభినందన్ పాక్ బోర్డర్‌లో దిగగానే ఏం జరిగింది?
ఇక ఇండియాలో కశ్మీర్‌లోని జమ్మూ, శ్రీనగర్, లేహ్ విమానాశ్రయాలను కూడా మూసివేశారు. అమృత్‌సర్, డెహ్రాడూన్ విమానాశ్రయాలను కూడా క్లోజ్ చేశారు. ఇలా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న క్రమంలో పలు వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది.