ట్రైన్ షాపింగ్ : రైల్లో ప్రయాణిస్తు షాపింగ్ చేసుకోవచ్చు

పంజాబ్ : రైల్లో షాపింగ్..మీకు కావాల్సినవన్నీ రైలు ప్రయాణంలో ఉండే షాపింగ్ చేసుకునే సౌకర్యం రానుంది. ఇది దూర ప్రాంతాలకు వెళ్లేవారికి మంచి సౌకర్యం. వీరు ఇంటికి సంబంధించిన వస్తువులు..ఫిటెనెస్ పరికరాల వరకూ అన్నింటినీ రైల్లోనే కొనుక్కోవచ్చు. పశ్చిమ రైల్వే ఈ ప్రాజక్టును 2019 జనవరిలో ప్రారంభించింది. దీనికి ప్రయాణికుల నుంచి అద్భుతమైన స్పందన కూడా వచ్చింది.
దీంతో ఈ ప్రాజక్టును దేశవ్యాప్తంగా అమలు చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల అనంతరం అన్ని రైల్వే జోన్లలో దీని కోసం టెండర్లు పిలవనుంది రైల్వే శాఖ. 2017లో రైళ్లలో చిన్నారులకు వేడిపాలు, బేబీఫుడ్ విక్రయాలను రైల్వేశాఖ ప్రారంభించిన రైల్వే తరువాత వాటిని నిలిపివేసింది. దీన్ని తిరిగి ప్రారంభించనున్నారు. పశ్చిమ రైల్వే విభాగంలోని 16 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం షాపింగ్ సౌకర్యాన్ని కల్పించామని రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది.