సెలబ్రిటీల టిక్‌టాక్ అకౌంట్లపై నీలి నీడలు..

భారత్, చైనా సరిహద్దు ఘర్షణ జరిగిన కొద్దివారాల తరువాత జాతీయ భద్రత, గోప్యతా సమస్యల కారణంగా టిక్ టోక్‌తో సహా 59 చైనా మొబైల్ యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది. భారత సార్వభౌమాధికారం మరియు సమగ్రత, భారత రక్షణ, రాష్ట్ర భద్రత మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అయితే చైనా మొబైల్ యాప్‌లను ప్రభుత్వం నిషేధించడంతో పలువురు సెలబ్రిటీలు డీలా పడిపోయారు. వారి ఖాతాలపై నీలినీడలు పరచుకున్నాయి. యాప్‌పై నిషేధం విధించగా.. వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లో పలువురు ప్రముఖుల ఖాతాలు, ప్రభుత్వ సంస్థల ఖాతాలపై డార్క్ చేసి నీడను పెట్టింది.
ఒకప్పుడు ఈ యాప్ అంతగా పాపులర్ కానప్పటికీ.. క్రమంగా బాలీవుడ్ నటీనటుల ఫోకస్ దీనిపై పడింది. దీనిపై వారి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. దీపికా పదుకొనె, సారా అలీఖాన్, షాహిద్ కపూర్, మాధురీ దీక్షిత్, టైగర్ ష్రాఫ్, కార్తీక్ ఆర్యన్ వంటి సెలబ్రిటీలు ఇందులో యాక్టీవ్‌గా ఉన్నారు. తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు దీనిపై ఆధారపడుతూ వచ్చారు. ఇప్పుడు వీరికి అటువంటి అవకాశం లేకుండా పోయింది.
ప్రభుత్వం కూడా ఇటీవల టిక్‌టాక్‌లో చురుకుగా ఉంది. మై గవర్నమెంట్ ఇండియా అకౌంట్‌కి సుమారు పది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. టిక్‌టాక్‌లో మై గోవ్ మాత్రమే అధికారిక ప్రభుత్వ ఖాతా కాదు. కర్ణాటక ప్రభుత్వం, గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్, మహారాష్ట్ర ప్రజారోగ్య విభాగం, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వరకు, అనేక బహుళ ప్రభుత్వ సంస్థలు మెరుగైన డేటా భద్రతా పద్ధతులపై సమాచారాన్ని ఉంచడానికి వేదికను ఉపయోగిస్తున్నాయి.
COVID-19 గురించి కూడా ఇందులో అవగాహన పెంచుతున్నాయి. ప్రభుత్వ నోడల్ కమ్యూనికేషన్ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, భారతదేశం-చైనా ప్రతిష్టంభనపై ప్రధానమంత్రి సందేశాలను పంచుకోవడానికి తన హ్యాండిల్‌ను ఉపయోగిస్తున్నాయి.
Read:అమ్మకోసం..వట్టిచేతులతో బావి తవ్విన యువతి: లేడీ భగీరథ