Indian woman Anju : పిల్లల్ని చూసేందుకు పాక్ నుంచి భారత్ రానున్న అంజూ
పాకిస్థాన్ దేశానికి వెళ్లి అక్కడి ఫేస్‌బుక్ స్నేహితుడిని పెళ్లాడిన అంజూ భారతదేశానికి రానుంది. తన ఇద్దరు పిల్లలు, భర్తను వదిలి ఫేస్‌బుక్ స్నేహితుడి కోసం పాకిస్థాన్ దేశానికి వెళ్లిన అంజూ తన పిల్లల్ని చూసేందుకు భారత్ వెళ్లేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి అనుమతి పొందిందని ఆమె భర్త నస్రుల్లా చెప్పారు.....

Indian woman Anju
Indian woman Anju : పాకిస్థాన్ దేశానికి వెళ్లి అక్కడి ఫేస్‌బుక్ స్నేహితుడిని పెళ్లాడిన అంజూ భారతదేశానికి రానుంది. తన ఇద్దరు పిల్లలు, భర్తను వదిలి ఫేస్‌బుక్ స్నేహితుడి కోసం పాకిస్థాన్ దేశానికి వెళ్లిన అంజూ తన పిల్లల్ని చూసేందుకు భారత్ వెళ్లేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి అనుమతి పొందిందని ఆమె భర్త నస్రుల్లా చెప్పారు.
Also Read : Vizianagaram Train Accident : 14కు చేరిన మృతుల సంఖ్య,100 మందికి పైగా గాయాలు,12 రైళ్లు రద్దు
తాము ఇస్లామాబాద్ నగరంలో విదేశీ మంత్రిత్వశాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నామని, అది రాగానే అంజూ భారత్ వెళుతుందని నస్రుల్లా పేర్కొన్నారు. భారత్‌లో ఉన్న తన పిల్లలను కలిసిన తర్వాత ఆమె పాకిస్థాన్‌కు తిరిగి వస్తుందని ఆయన చెప్పారు. అంజూ ప్రస్థుతం తన భార్య అని, ఆమె నివాసం పాకిస్థాన్ దేశంలోని పఖ్తున్‌ఖ్వాలోని మారుమూల గ్రామమని నస్రుల్లా తెలిపారు.
Also Read : Plane crash : బ్రెజిల్ దేశంలో కూలిన విమానం…12 మంది మృతి
ఆగస్ట్‌లో ఇస్లాం మతంలోకి మారి నస్రుల్లాతో వివాహం జరిగిన తరువాత అంజూ పేరురను ఫాతిమాగా మార్చారు. అంజూ వీసాను పాకిస్థాన్ ఒక సంవత్సరం పొడిగించింది. అంజూకి రాజస్థాన్‌లో ఉండే అరవింద్‌తో ఇంతకు ముందు పెళ్లయింది. వీరికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు.