Needle Free Covid Vaccine : సూది, నొప్పి లేకుండానే కరోనా వ్యాక్సిన్.. దేశంలోనే తొలిసారిగా..

సూది, నొప్పికి భయపడి కరోనా టీకాకు దూరంగా ఉంటున్న వారి కోసం జైకోవ్-డి.. నీడిల్ లెస్ వ్యాక్సిన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో సూది వాడరు. ఇక నొప్పే ఉండదు.

Needle Free Covid Vaccine : సూది, నొప్పి లేకుండానే కరోనా వ్యాక్సిన్.. దేశంలోనే తొలిసారిగా..

Needle Free Covid Vaccine

Updated On : February 5, 2022 / 8:51 PM IST

Needle Free Covid Vaccine : కరోనావైరస్ మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మహమ్మారి తగ్గింది అని ఊపిరిపీల్చుకునే లోపు.. కొత్త వేరియంట్ రూపంలో మళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది. గతంలో డెల్టా వేరియంట్ చుక్కలు చూపించింది. అది తగ్గిందని రిలాక్స్ అయ్యే లోపు.. ఒమిక్రాన్ వేరియంట్ విరుచుకుపడింది. ఇలా కరోనా మమమ్మారి కొత్త రూపాల్లో విజృంభిస్తూనే ఉంది.

ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని నిపుణులు తేల్చి చెప్పారు. టీకాతోనే కరోనాను ఖతం చేయొచ్చని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తమ పౌరులకు వ్యాక్సిన్లు ఇచ్చాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నాయి. రీసెంట్ గా పిల్లలకు కూడా వ్యాక్సిన్లు వేయడం స్టార్ట్ చేశారు. చాలామంది ఇప్పటికే రెండు డోసుల టీకా తీసుకున్నారు. ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో బూస్టర్ డోస్ కూడా ఇస్తున్నారు.

Mukesh Ambani: భారత్ లోనే అత్యంత ఖరీదైన కారును సొంతం చేసుకున్న ముకేశ్ అంబానీ

అయితే ఇంకా.. కొందరు వ్యాక్సిన్ కు దూరంగానే ఉంటున్నారు. దీనికి కారణం సూది, నొప్పి భయం. ప్రస్తుతం ఇస్తున్న టీకాలన్నీ కూడా సూది రూపంలోనే ఇస్తున్నారు. అయితే సూది భయం ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు.

ఇక ముందు అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. సూది, నొప్పికి భయపడి కరోనా టీకాకు దూరంగా ఉంటున్న వారి కోసం జైకోవ్-డి.. నీడిల్ లెస్ వ్యాక్సిన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో సూది వాడరు. ఇక నొప్పే ఉండదు. రేజర్ మాదిరి ఉండే టూల్ తో భుజానికి షాట్ ఇస్తారు. దీంతో ఎలాంటి నొప్పి ఉండదని కంపెనీ చెబుతోంది.

Worst Passwords: ఈ పాస్‌వర్డ్‌లు పెట్టుకున్నారా? వెంటనే మార్చుకోండి.. సెకన్లలో హ్యాక్ చేసేస్తారు

మన దేశంలో తొలిసారిగా పాట్నాలో ఈ తరహా విధానాన్ని అమలు చేసింది కంపెనీ. దేశీయంగా జైడస్ క్యాడిలా రూపొందించిన ఈ టీకాను 28 నుంచి 56 రోజుల వ్యవధిలో తీసుకోవాల్సి ఉంటుంది. ఓసారి ఎడమ చేతికి, మరోసారి కుడి చేతికి టీకా ఇస్తారు. పాట్నాలో ప్రస్తుతం మూడు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో(పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్, పాలిటెక్నిక్ కాలేజ్, గురునానక్ భవన్) ఈ తరహా వ్యాక్సిన్ ఇస్తున్నారు.