Omicron In India : 151కి పెరిగిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య..ఢిల్లీలో సీన్ రివర్స్

దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మహారాష్ట్రలో నమోదైన ఆరు కొత్త కేసులతో కలిపి ఆదివారం నాటికి దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 151

Omicron In India : 151కి పెరిగిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య..ఢిల్లీలో సీన్ రివర్స్

Covid

Updated On : December 19, 2021 / 9:43 PM IST

Omicron In India : దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మహారాష్ట్రలో నమోదైన ఆరు కొత్త కేసులతో కలిపి ఆదివారం నాటికి దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 151కి చేరింది. 11 రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా…అత్యధికంగా మహారాష్ట్రలో 54 కేసులు నమోదయ్యాయి.

ఆ తర్వాత ఢిల్లీలో అత్యధికంగా 22,తెలంగాణలో 20,రాజస్తాన్ లో 17,కర్ణాటకలో 14,కేరళలో 11,గుజరాత్ లో 9,పంజాబ్ లో 1,తమిళనాడులో 1,వెస్ట్ బెంగాల్ లో 1 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

ఇక,ఢిల్లీలో జూన్-27 తర్వాత ఇవాళే అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 107 కోవిడ్ కేసులు ఆదివారం నమోదుకాగా..జూన్-27 నుంచి ఒక్క రోజులో ఢిల్లీలో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. ఇక మహారాష్ట్రలో కూడా ఇవాళ 902 కరోనా కేసులు నమోదయ్యాయి.

ALSO READ Rahul On Indian’s DNA : హిందుత్వవాదులే అలా..RSS చీఫ్ డీఎన్ఏ వ్యాఖ్యలపై రాహుల్