నిమిషానికి రూ. వెయ్యి కోట్లు.. రూ.3.80 లక్షల కోట్లు నష్టం

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నట్లుగా వస్తోన్న వార్తల నేపధ్యంలో స్టాక్ మార్కెట్లలో పతనం కనిపిస్తోంది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా.. పెరుగుతున్న బాండ్ల జారీ.. తీవ్రం కావడంతో.. అనిశ్చిత పరిస్థితులతో దేశీయ స్టాక్ మార్కెట్లు నెత్తురోడగా.. ఫలితంగా ఇంట్రా డే ట్రేడింగ్‌లో నిమిషానికి ఇన్వెస్టర్లు రూ.వెయ్యి కోట్లకు పైగా పెట్టుబడులను కోల్పోయారు.
ట్రేడింగ్ ముగిసే సరికి ఇన్వెస్టర్లు రూ.3.80 లక్షల కోట్లు నష్టపోగా.. మార్కెట్ల పతనానికి స్వల్పకాలిక సర్దుబాట్లు కూడా కారణం అయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 1,145.44 పాయింట్లు (2.24 శాతం) నష్టపోయి మూడు వారాల తర్వాత 50 వేల దిగువన 49, 744.32 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 306.05 పాయింట్లు కోల్పోయి 14,675.70 పాయింట్ల వద్ద నిలిచింది.
కరోనా కేసులు పెరుగుదలయ కారణంగా ఆర్థిక ఆంక్షలు ఎక్కువ కావడంతో అంతర్జాతీయ పరిస్థితులు బలహీనం అయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్‌ను బలహీన పరచగా.. మంత్లీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్‌పైరీ వీక్ కూడా స్టాక్స్ పతనానికి కారణం అని నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీలో మెటల్ లబ్ధి పొందగా, సెన్సెక్స్‌లో రిలయన్స్, హెచ్డీఎఫ్‌సీ, టీసీఎస్ భారీగా లాభపడ్డాయి.