వారికి మాత్రమే : రైల్వే ఈ-టికెట్లపై 50 శాతం డిస్కౌంట్
ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రైల్వే టికెట్లపై 50శాతం డిస్కౌంట్ ప్రకటించింది.

ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రైల్వే టికెట్లపై 50శాతం డిస్కౌంట్ ప్రకటించింది.
ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రైల్వే ఈ-టికెట్లపై 50శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఐఆర్ సీటీసీ ద్వారా రైలు టికెట్ బుక్ చేసుకున్న సీనియర్ సిటిజన్స్ సహా పలువురికి టికెట్ ధరపై రాయితీ అందిస్తోంది. ఈ డిస్కౌంట్.. సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు, విద్యార్థులు, డాక్టర్లు, మీడియా ప్రతినిధులు, క్రీడాకారులు, యుద్ధంలో భర్తను కోల్పోయిన మహిళలకు వర్తిస్తుందని ఐఆర్ సీటీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
60 ఏళ్లుకు పైన వయసు ఉన్న మగవారు, 58ఏళ్లు, ఆపై వయసు ఉన్న మహిళలు ఈ తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. మెయిల్, ఎక్స్‌ప్రెస్, రాజధాని, శతాబ్ది, జన్ శతాబ్ది వంటి ట్రైన్లలో మాత్రమే ఈ టికెట్ల ధరపై డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
IRCTC e-ticketing, www.irctc.co.in వెబ్‌సైట్లో సీనియర్ సిటిజన్స్, ట్రైన్ టికెట్ బుకింగ్స్‌పై రాయితీని పొందొచ్చు. ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్స్, రిజర్వేషన్ ఆఫీసుల్లోనూ ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ట్రైన్ టికెట్ ధరపై పురుషులు 40 శాతం వరకు, మహిళలు 50 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.