Maharashtra Politics: ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడ్డాక కూడా ఏకనాథ్ షిండే సీఎంగా కొనసాగుతారా? అసలు బీజేపీ ప్లాన్ ఏంటి?
సీఎం ఏక్‌నాథ్ షిండేతో పాటు ఆయన వర్గంలోని పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యంపై అసెంబ్లీ స్పీకర్‌పై సుప్రీంకోర్టు గతంలో అసంతృప్తి వ్యక్తం చేసింది

Eknath Shinde: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై అనర్హత వేటు పడదని, ఒకవేళ ఇలా జరిగినా ఆయన శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై పదవిలో కొనసాగుతారని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. అక్టోబరు 17న, శివసేనకు చెందిన రెండు వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై వాస్తవిక కాలపరిమితిని నిర్ణయించేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు సుప్రీంకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. పార్టీలో చీలిక నేపథ్యంలో తమ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని వర్గాలు ఈ పిటిషన్‌లు దాఖలు చేశాయి.
శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)కి చెందిన శరద్ పవార్ వర్గం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. కొందరు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై ముందస్తు నిర్ణయం తీసుకునేలా నర్వేకర్‌ను ఆదేశించాలని ఈ పిటిషన్లలో వినతి పత్రం అందించారు. శనివారం మీడియాతో ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘‘షిండేపై అనర్హత వేటు పడదని, అనర్హత వేటు పడినప్పటికీ శాసనమండలి సభ్యునిగా ఎన్నుకుంటాం. ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారు. వచ్చే ఎన్నికలు ఆయన నేతృత్వంలోనే జరుగుతాయి’’ అన్నారు.
సీఎం ఏక్‌నాథ్ షిండేతో పాటు ఆయన వర్గంలోని పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యంపై అసెంబ్లీ స్పీకర్‌పై సుప్రీంకోర్టు గతంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను విస్మరించలేమని ధర్మాసనం పేర్కొంది. ఉద్ధవ్‌కు విధేయులైన ఎమ్మెల్యేలపై షిండే వర్గం కూడా ఇలాంటి అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది. పిటిషన్లపై నిర్ణయానికి గడువు ఇవ్వాలని సెప్టెంబర్ 18న సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది.