26/11 Mumbai attacks : 26/11 ముంబయి ఉగ్రదాడి జరిగి 15 ఏళ్లు… లష్కరేతోయిబాను ఉగ్రవాద సంస్థగా ఇజ్రాయెల్ ప్రకటన
నవంబరు 26వతేదీ ముంబయి నగరంపై పాకిస్థాన్ దేశానికి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేసి 15 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. 26/11 ముంబయి దాడుల 15వ వార్షికోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ పాక్ లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది....

26/11 Mumbai attacks
26/11 Mumbai attacks : నవంబరు 26వతేదీ ముంబయి నగరంపై పాకిస్థాన్ దేశానికి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేసి 15 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. 26/11 ముంబయి దాడుల 15వ వార్షికోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ పాక్ లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. విషాదకరమైన ముంబయి ఉగ్రవాద దాడుల 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇజ్రాయెల్ అధికారికంగా లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిందని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ALSO READ : Telangana Assembly Election 2023 : తెలంగాణలో సమీపిస్తున్న పోలింగ్ పర్వం…హోరెత్తిన అగ్రనేతల ప్రచారం
లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడానికి అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని, భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక అభ్యర్థన లేకుండా స్వతంత్రంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం పేర్కొంది. 26/11 ఉగ్రదాడి సందర్భంగా ముంబయిలోని చాబాద్ హౌస్ వద్ద జరిగిన ఉగ్రదాడుల సమయంలో బాధితులైన ఆరుగురు యూదుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ జాతీయులు కూడా ఉన్నారు.
ALSO READ : Uttarkashi Tunnel : ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితం.. దృశ్యాలు విడుదల
ఇజ్రాయెల్ తన సరిహద్దుల లోపల లేదా చుట్టుపక్కల లేదా భారతదేశం మాదిరిగానే చురుకుగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలను మాత్రమే ఉగ్రవాద సంస్థలుగా జాబితా చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలను గ్లోబల్ ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ప్రకటించింది. ఇటీవల హమాస్ దాడులు జరిగిన నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు గత కొన్ని నెలలుగా లష్కరే తోయిబా సంస్థను ఉగ్రవాద సంస్థను గుర్తించింది.
ALSO READ : Telangana Assembly Election 2023 : రాజకీయ నేతల ర్యాష్ డ్రైవింగ్.. పెండింగులో ట్రాఫిక్ చలానాలు
వందలాది మంది భారతీయులను హతమార్చిన లష్కరే తోయిబాను ఉగ్రవాదసంస్థగా ఇజ్రాయెల్ ఎంబసీ ప్రకటించింది. 2008వ సంవత్సరం నవంబర్ 26 వతేదీన జరిగిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబయిలో జరిపిన దాడులు హేయమైనవని ఇజ్రాయెల్ పేర్కొంది.
ALSO READ : International Emmys 2023 : అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ వేదికపై ఎర్రరంగు చీరలో మెరిసిన నటి షెఫాలీ షా
ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తీవ్రవాద బాధితులందరికీ, ప్రాణాలతో బయటపడిన, ముంబయి దాడుల్లో మరణించిన కుటుంబాలకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసింది. ఈ హేయమైన చర్యతో ప్రభావితమైన వారికి ఇజ్రాయెల్ దేశం 15 ఏళ్ల తర్వాత సంఘీభావం తెలియజేసింది. శాంతియుత ప్రపంచ భవిష్యత్తు కోసం తాము భారతదేశంతో కలిసి పనిచేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది.