సంజయ్ జైన్ ఇంట్లో రూ. 62 కోట్లు సీజ్

  • Published By: madhu ,Published On : October 28, 2020 / 12:00 PM IST
సంజయ్ జైన్ ఇంట్లో రూ. 62 కోట్లు సీజ్

Updated On : October 28, 2020 / 12:09 PM IST

It Dept Seize Rs 62 Crores : ఎంట్రీ ఆప‌రేట‌ర్ సంజ‌య్ జైన్‌ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అతని లబ్దిదారుల నివాసాలపై కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 62 కోట్లు సీజ్ చేశారు.



ఢిల్లీ -ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్త‌రాఖండ్‌, హ‌ర్యానా, పంజాబ్‌, గోవా రాష్ట్రాల్లో ఉన్న ఇండ్లు, కార్యాల‌యాల్లో ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి. 42 ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు చేస్తోంది. 2.89 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.



ఫేక్ బిల్లులను సృష్టించి..భారీగా డబ్బులు సంపాదించాడని తెలుస్తోంది. ఈ రాకెట్ ను ఐటీ శాఖ అధికారులు 2020, అక్టోబర్ 27వ తేదీ మంగళవారం చేధించిన సంగతి తెలిసిందే. సుమారు 500 కోట్ల విలువైన ఎంట్రీ డాక్యుమెంట్ల‌ను సీజ్ చేశారు. 17 బ్యాంకు లాక‌ర్ల నుంచి కోట్ల విలువైన న‌గుదు, బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.