కూతురు,అల్లుడితో కలిసి భారత పర్యటనకు ట్రంప్

  • Published By: venkaiahnaidu ,Published On : February 21, 2020 / 10:07 AM IST
కూతురు,అల్లుడితో కలిసి భారత పర్యటనకు ట్రంప్

Updated On : February 21, 2020 / 10:07 AM IST

 రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. అయితే ట్రంప్ తో పాటుగా ఆయన కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జరీద్ కుష్నర్ కూడా ఢిల్లీలో అడుగుపెడుతున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడికి ఇవాంకా,కుష్నార్ లు సీనియర్ సలహాదారులుగా ఉన్న విషయం తెలిసిందే. 

ట్రంప్ బృందంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రెయిన్,టెజ్రీరరీ సెక్రటరీ స్టీవ్ మ్నుచిన్,కామర్స్ సెక్రటరీ విల్బర్ రోస్,ఇంధనశాఖ సెక్రటరీ బ్రౌయలట్టీ కూడా ఉండనున్నారు. మరోవైపు ట్రేడ్ డీల్ కోసం భారత వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ తో  చర్చలు జరిపిన అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్‌హైజర్‌ ట్రంప్‌ పర్యటన బృందంలో లేరు. భారత్-అమెరికాల మధ్య ఇంకా కొన్ని విబేధాలు నెలకొన్న కారణంగా రెండుదేశాలు ప్రస్తుతం ట్రేడ్ డీల్ ను పక్కన పెట్టాయి.

భారత్ తో ఇప్పట్లో ట్రేడ్ డీల్ (వాణిజ్య ఒప్పందం)ఉండదని పర్యటనకు ముందే చెప్పారు ట్రంప్. మంగళవారం(ఫిబ్రవరి-18,2020) తన భారత పర్యటన గురించి మీడియా ప్రతినిధులతో ట్రంప్ మాట్లాడుతూ…. భారత్‌ తో ట్రేడ్‌ డీల్స్‌ కు కట్టుబడి ఉన్నామని,అయితే అది అధ్యక్ష ఎన్నికల తరువాత ఆలోచిస్తామని తెలిపారు. భవిష్యత్తులో భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం తప్పక ఉంటుందని ట్రంప్‌….భారత్ తో ట్రేడ్ డీల్ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నవంబర్ కి ముందు జరుగుతుందో లేదో అన్నది తనకు తెలియదన్నారు.

ఫిబ్రవరి-23న ఢిల్లీలో అడుగుపెట్టనున్న ట్రంప్..ఫిబ్రవరి-24న అహ్మదాబాద్ లో పర్యటిస్తారు. అహ్మదాబాద్ లో రోడ్ షో తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్దదైన సర్థార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియంను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ లక్షల మందిని ఉద్దేశించి ట్రంప్-మోడీలు ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం అక్కడి నుంచి కుటుంబసమేతంగా ఆగ్రా వెళ్లనున్నారు ట్రంప్.అనంతరం అక్కడి నుంచి అధికారిక చర్చల కోసం ఢిల్లీకి వెళ్లనున్నారు ట్రంప్.