Tiger Attacks Crocodile: వామ్మో.. చిరుత గురిపెడితే ఇట్లుంటది..! నీళ్లలోకి దూకి మొసలిని ఒడ్డుకు లాక్కొచ్చిన పులి.. వీడియో వైరల్
చిరుత పులి దాడిచేసేందుకు గురిపెట్టిందంటే అవతల ఎలాంటి జంతువైనా లొంగిపోవాల్సిందే.. అది నేలపైనే అనుకుంటే పొరపాటే.. నీళ్లలోఉన్న మొసళ్లను సైతం తన పంజాతో వేటాడి ఒడ్డుకు లాక్కొచ్చేయగలదు.

tiger attack
Tiger Attacks Crocodile: చిరుత పులి దాడిచేసేందుకు గురిపెట్టిందంటే అవతల ఎలాంటి జంతువైనా లొంగిపోవాల్సిందే.. అది నేలపైనే అనుకుంటే పొరపాటే.. నీళ్లలోఉన్న మొసళ్లను సైతం తన పంజాతో వేటాడి ఒడ్డుకు లాక్కొచ్చేయగలదు. అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆకలి మీదున్న పులి అమాంతం నీళ్లలోకి దూకి మొసలిని నోట కరుచుకొని ఒడ్డుకు లాక్కొచ్చింది. చిరుత నోట్లో చిక్కుకొని మొసలి గిలగిలా కొట్టుకుంటున్నా ఏమాత్రం చిరుత తన పట్టును విడవలేదు.
Viral Video: మన మధ్య గొడవొద్దు..! నీకు కొంచెం.. నాకు కొంచెం.. పిల్లుల ఐక్యత అదుర్స్..! వీడియో వైరల్
మొసలి నీళ్లలో ఉన్నప్పుడు వేటాడాలంటే ఏ జంతువుకైనా చాలా కష్టం. ఎందుకంటే నీళ్లలో ఉన్న మొసలికి బలమెక్కువ. అందుకే పులి, సింహాలుసైతం మొసళ్లు ఉన్న నీటి కుంటల వద్దకు వెళ్లి నీరు తాగాలంటే కొంచెం అప్రమత్తంగా ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూస్తున్న వీడియోలో ఓ చిరుత పులి నేరుగా నీళ్లలోకి దూకి మొసలిని ఒడ్డుకు లాక్కొచ్చింది. ట్విట్టర్‌లో కనిపించిన ఈ వీడియో ఓ నది ప్రాంతంలోనిది. సోమవారం ఫిగెన్ అనే వినియోగదారుడు దీనిని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. ‘ఓ మైగాడ్.. వాట్ ఏ పవర్’ అంటూ శీర్షిక ఇచ్చాడు.
https://twitter.com/TheFigen/status/1558886132619804672?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1558886132619804672%7Ctwgr%5E88722b442422203482f04720e982401766414989%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Fleopard-attack-on-crocodile-viral-video-au42-767316.html
42 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోలో రెండు క్రూరమైన అడవి జంతువులు మనుగడ కోసం తీవ్రమైన యుద్ధంలో పోరాడుతున్నట్లు చూడవచ్చు. చిరుత దాని దవడలలో మొసలి మెడను పట్టుకొని నది లోపలి నుంచి ఒడ్డుకు లాక్కొచ్చినట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. వీడియో ట్విటర్ లో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 2.6 మిలియన్ల మంది వీక్షించారు. 27,000 కంటే ఎక్కువ లైక్‌లను వచ్చాయి. 4,800 నెటిజన్లు రీ ట్వీెెట్ చేస్తూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.