Jai Ho ISRO : చంద్రయాన్ ల్యాండింగ్ సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం

చంద్రయాన్ -3 ల్యాండింగ్ సందర్భంగా బుధవారం సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశా సముద్ర తీరంలో జయహో ఇస్రో అంటూ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఆల్ ద బెస్ట్ అంటూ ఇస్రో శాస్త్రవేత్తలకు సుదర్శన్ పట్నాయక్ శుభాకాంక్షలు తెలిపారు....

Jai Ho ISRO : చంద్రయాన్ ల్యాండింగ్ సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం

Jai Ho ISRO

Chandrayaan-3 Landing : చంద్రయాన్ -3 ల్యాండింగ్ సందర్భంగా బుధవారం సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశా సముద్ర తీరంలో జయహో ఇస్రో అంటూ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఆల్ ద బెస్ట్ అంటూ ఇస్రో శాస్త్రవేత్తలకు సుదర్శన్ పట్నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. (Odisha Sand Artist Tribute Ahead Of Chandrayaan-3 Landing) చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర టచ్ డౌన్ చేయడానికి షెడ్యూల్ చేశారు. (Jai Ho ISRO)

Chandrayaan 3 landing : చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రోగ్రాంలో వర్చువల్‌గా చేరనున్న మోదీ

పట్నాయక్ తన సైకత శిల్పంలో చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధృవం మీద భారత జెండాను ఉంచి విజయవంతంగా ల్యాండింగ్ చేస్తున్నట్లు చూపించారు. చంద్రయాన్ -3 ల్యాండింగ్ విజయవంతం కావాలని కోరుతూ దేశవ్యాప్తంగా సర్వమతాల ప్రార్థనలు జరిగాయి.

Joe Biden : సెప్టెంబర్ 7-10 తేదీల మధ్య జోబిడెన్ భారత్ పర్యటన

చంద్రయాన్ -3 సేఫ్ ల్యాండింగ్ అనంతరం అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాల్గవ దేశంగా భారత్ నిలవనుంది. చంద్రయాన్ -3 ల్యాండింగ్ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం బుధవారం సాయంత్రం 5:20 గంటల నుంచి ఇస్రో వెబ్‌సైట్, దాని యూట్యూబ్ ఛానల్, ఫేస్ బుక్, పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ డీడీ నేషనల్ టీవీలో చేయనున్నారు.