Jamili Election : జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలన కమిటీ తొలి సమావేశం.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై చర్చ

మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కమిటీ సభ్యులు చర్చించారు. జమిలి ఎన్నికలపై వాటాదారులు, రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు.

Jamili Election : జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలన కమిటీ తొలి సమావేశం.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై చర్చ

Jamili election committee

Updated On : September 23, 2023 / 7:56 PM IST

Jamili Election Committee – First Meeting : జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలిన కమిటీ తొలి సమావేశం ముగిసింది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. శనివారం ఈ కమిటీ ఢిల్లీలో  తొలిసారి సమావేశం అయింది.

మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కమిటీ సభ్యులు చర్చించారు.  ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, అమిత్ షా, అర్జున్ రామ్ మేఘ్వాల్ తో పాటు గులాం నబీ ఆజాద్ హాజరయ్యారు. జమిలి ఎన్నికలపై వాటాదారులు, రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు.

Telangana Elections : తెలంగాణలో జమిలి ఎన్నికలు లేనట్టే.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎలక్షన్స్!

ఏదైనా రాజకీయ పార్టీ కమిటీని కలిసి సూచనలు ఇవ్వవచ్చు అన్నారు. భారత ఎన్నికల సంఘం, న్యాయ కమిషన్ సహా ఇతర సంస్థల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు చర్చలు జరపాలని నిర్ణయించారు.