PUBG Game గట్టిగా అరవొద్దన్నందుకు కొట్టి చంపేశారు

  • Published By: madhu ,Published On : August 6, 2020 / 08:43 AM IST
PUBG Game గట్టిగా అరవొద్దన్నందుకు కొట్టి చంపేశారు

Updated On : August 6, 2020 / 10:03 AM IST

PUBG Game మరొకరి ప్రాణం తీసింది. గేమ్ ఆడుతూ…పెద్ద పెద్ద శబ్దాలు చేయవద్దని చెప్పడంతో ఆగ్రహానికి గురైన కొందరు యువకులు..ఒకరిపై దాడి చేయడంతో అక్కడికక్కడనే మరణించాడు. ఈ విషాద ఘటన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.



ఆర్ఎస్ పురా తాలుఖాలోని బద్యాల్ ఖాజియాన్ గ్రామంలో బిక్రమ్ జీత్, రాజ్ కుమార్, రోహిత్ కుమార్ పబ్జీ గేమ్ ఆడుతున్నారు. వీరు గేమ్ లో లీనమవుతూ..పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నారు. వీరికి సమీపంలో దిలీప్ రాజ్ అనే వ్యక్తి పెద్ద పెద్ద శబ్దాలు చేయొద్దని కోరాడు. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆ ముగ్గురు దిలీప్ పై దాడి చేశారు. చెక్కతో దాడి చేయడంతో కుప్పకూలి చనిపోయాడు.



పబ్జీ గేమ్ ప్రపంచంలోనే అత్యంత పాపులర్ గేమ్.
ఎంతో మందిని బలి తీసుకుంది. దీనిని బ్యాన్ చేయాలనే డిమాండ్స్ వినిపించాయి. ఈ గేమ్ ఆడుతూ…పలువురు పిచ్చివాళ్లుగా మారిపోయారు. అందులో లీనమవుతూ..ప్రమాదవశాత్తు కిందపడి కొంతమంది చనిపోయారు. సెల్ ఫోన్ లో పబ్జీ గేమ్ ఆడవద్దన్నందుకు..మందలించినందుకు ఇంకొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.