మహారాష్ట్రలో జనత కర్ఫ్యూ పొడిగింపు

  • Published By: chvmurthy ,Published On : March 22, 2020 / 10:56 AM IST
మహారాష్ట్రలో జనత కర్ఫ్యూ పొడిగింపు

Updated On : March 22, 2020 / 10:56 AM IST

మహమ్మారి కోవిడ్ 19 వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 14 గంటల జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమై కర్ఫ్యూను విజయవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూను రేపటి (సోమవారం) మార్చి22 ఉదయం వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. 
 

అదేవిధంగా మహారాష్ట్రలో సెక్షన్‌ 144 కొనసాగుతుందన్నారు. ఈ విషయంలో రాజీపడేది లేదన్నారు. అంతేకాకుండా కరోనా కట్టడి అయ్యేవరకు రాష్ట్రంలోకి విదేశీ విమానాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేశారు. కరోనా విజృంభణతో మహారాష్ట్ర తీవ్రంగా ప్రభావితమవుతోంది. 
 

దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 75కు పెరిగింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా స్టేజ్‌ 3 దిశగా పయనిస్తోందని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని ఆయన తెలిపిన విషయం తెలిసిందే.