Javed Akhtar Tweet : జావేద్ అక్తర్ పెట్టిన ట్వీట్ వెనుక సీక్రెట్ ఏంటి?

హిందీ పాటల రచయిత జావేద్ అక్తర్ పెట్టిన సింగిల్ లెటర్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆయన ట్వీట్‌పై పలువురు సరదాగా పెట్టిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

Javed Akhtar Tweet : జావేద్ అక్తర్ పెట్టిన ట్వీట్ వెనుక సీక్రెట్ ఏంటి?

Javed Akhtar Tweet

Updated On : July 14, 2023 / 3:21 PM IST

Javed Akhtar Tweet : ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ తెలియని వారుండరు. ఆయన తరుచుగా ట్విట్టర్‌లో యాక్టివ్ ఉంటారు. ప్రస్తుత సమస్యలపైనా.. తన పని, అప్ డేట్లను షేర్ చేసుకుంటారు. అయితే తాజాగా ఆయన పెట్టిన ట్వీట్ కాస్త ఆసక్తికరంగా మారింది.

Javed Akhtar: ముంబై దాడుల సూత్రధారులు పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు.. పాకిస్తాన్‌లోనే విమర్శించిన జావేద్ అక్తర్

జావేద్ అక్తర్ తాజాగా పెట్టిన ట్వీట్ చూసి నెటిజన్లు ఆలోచనలో పడిపోయారు. తన ట్విట్టర్ ఖాతాలో (@Javedakhtarjadu) ‘పీ’ అని హిందీలో ఒకే ఒక్క లెటర్‌తో ట్వీట్ చేశారు. ఇక ఆయన ట్వీట్‌కి టిండర్ ఇండియా ‘క్యూ’ (queue) అని రిప్లై ఇచ్చింది. ఇక స్విగ్గీ ‘ఖా'(తినడం) హిందీలో ఒకే లెటర్ జావేద్ ట్వీట్‌కి జవాబు ఇచ్చింది. ఇలా ఆయన పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది. ఇక ఇద్దరు వ్యక్తులు ఈ ఫోటోను షేర్ చేస్తూ ‘పీ రహే హై జావేద్ సాహెబ్’ అని క్యాప్షన్ ఇస్తూ పోస్ట్ చేశారు.

Twitter Blue Tick : కాళ్ల మీద పడమంటావా.. అమితాబ్ ప్రశ్న.. ట్విట్టర్ బ్లూ టిక్ పై సెలబ్రేటిస్ ఫన్నీ ట్వీట్స్..

ఇంతకీ జావేద్ నెటిజన్ల నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయా? అని ట్వీట్ చేశారో.. నిజంగానే ఆయన ట్వీట్ చేసిన సింగిల్ అక్షరం ‘పీ’ వెనుక  నిగూఢంగా ఏదైనా రహస్యం దాగి ఉందో.. ఆయనే చెప్పాలి ఇక. ప్రస్తుతానికి ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.