Kiren Rijiju: న్యాయ వ్యవస్థ ఇక పూర్తిగా డిజిటల్.. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు
ఈ-కమిటీ చైర్మన్ పదవి నుంచి తాను వైదొలగే లోపు నూతన ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను ఆయన ఇప్పటికే అభ్యర్థించారట. కాగా, ఈ విషయమై మరోసారి సీజేఐ సహా కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిని కలిసి చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే కోర్టుల్లో పేరుకుపోయిన కేసుల పరిష్కారానికి సింగిల్ విండో విధానం ద్వారా పరిష్కారం చూపాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు

Judiciary to go paperless soon, says Law Minister Kiren Rijiju
Kiren Rijiju: న్యాయ వ్యవస్థలో డిజిటల్ మార్పులు తీసుకు రానున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం ప్రకటించారు. ఇక నుంచి అన్ని కార్యకలాపాలు పేపర్ రహితంగా జరగనున్నాయని ఆయన తెలిపారు. ఈ విషయమై న్యాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ-కోర్టుల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. ప్రస్తుతం ఉన్న న్యాయ వ్యవస్థను ఈ-కోర్టుల్లోకి మలచడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని.. సమాచారం, సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈ-కమిటీ చైర్మన్ పదవి నుంచి తాను వైదొలగే లోపు నూతన ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను ఆయన ఇప్పటికే అభ్యర్థించారట. కాగా, ఈ విషయమై మరోసారి సీజేఐ
సహా కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిని కలిసి చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే కోర్టుల్లో పేరుకుపోయిన కేసుల పరిష్కారానికి సింగిల్ విండో విధానం ద్వారా పరిష్కారం చూపాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో సుమారు 5 కోట్లకు పైగా కేసులు పెండింగులో ఉన్నట్లు వెల్లడించారు.