కమల్‌నాథ్‌కు కవుకు దెబ్బ..బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియా

  • Published By: venkaiahnaidu ,Published On : March 11, 2020 / 09:33 AM IST
కమల్‌నాథ్‌కు కవుకు దెబ్బ..బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియా

Updated On : March 11, 2020 / 9:33 AM IST

అందరూ ఊహించినట్లుగానే జరిగింది. మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు 49ఏళ్ల జ్యోతిరాధిత్య సింధియా. మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాధిత్య ఇవాళ(మార్చి-11,2020)బీజేపీలో చేరారు. ఇప్పటివరకు గాంధీ కుటుంబానికి దగ్గరి మిత్రుడిగా ఉన్న జ్యోతిరాధిత్య బుధవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నాడు.(బీజేపీ దెబ్బకొడుతుందని 8నెలల క్రితం హింటిచ్చాడు..ఇప్పుడు ప్రభుత్వాన్ని తానే కూల్చేస్తున్నాడు!!)

జ్యోతిరాధిత్యకు బీజేపీ సభ్యత్వాన్ని ఇచ్చారు జేపీ నడ్డా. సింధియా బీజేపీలో చేరడం ఎంతో ఆనందం కలిగించిందని నడ్డా తెలిపారు. జ్యోతిరాధిత్య వర్గంలోని 22మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీకి రాజీనామాలు చేసి బెంగళూరులోని ఓ రిసార్ట్ లో ఉంటున్న విషయం తెలిసిందే.

ఇవాళ కాషాయ కండువా కప్పుకున్న అనంతరం జ్యోతిరాధిత్య సింధియా..జేపీ నడ్డాతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ…. వాళ్ల కుటుంబంలోకి నన్ను ఆహ్వానించి,స్థానం కల్పించిన నడ్డా,ప్రధానమంత్రి నరేంద్రమోడీ,హోంమంత్రి అమిత్ షాకు  ధన్యవాదాలు చెబుతున్నాను. నాకు రెండు జీవితాన్ని మార్చేసిన ఘటనలు ఉన్నాయి. అందులో ఒకటి నా తండ్రి మాధవరావు సింధియా చనిపోయిన రోజు. రెండవది,మంగళవారం రోజు నా జీవితంలో కొత్త మార్గం ఎంచుకోవాలని నిర్ణయంచుకున్నాను. గతంలో ఉన్న మాదిరిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాసేవ చేయాలన్న లక్ష్యం నెరవేరలేదని కాన్ఫిడెన్స్ తో నేను చెప్పగలను. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రస్తుత పరిస్థితి సరిగా లేదని జ్యోతిరాధిత్య సింధియా అన్నారు.

మరోవైపు కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో బీజేగా ఉంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానంలో జైపూర్ కి తరలించింది కాంగ్రెస్. తామంతా సీఎం కమల్ నాథ్ వెంటే ఉన్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. తమ సర్కార్ కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని సీఎం కమల్ నాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.