గెలుపు కోసం రాజకీయాల్లోకి రాలేదు : చిరంజీవి సలహాకి కౌంటర్
ఇటీవల తమిళ మ్యాగజైన్ ఆనంద వికటన్‌కు మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో స్టార్ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం గురించి చిరంజీవిని

ఇటీవల తమిళ మ్యాగజైన్ ఆనంద వికటన్‌కు మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో స్టార్ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం గురించి చిరంజీవిని
ఇటీవల తమిళ మ్యాగజైన్ ఆనంద వికటన్‌కు మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో స్టార్ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం గురించి చిరంజీవిని అడిగారు. దానికి ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు చిరంజీవి. కమల్ హాసన్, రజనీకాంత్‌లు రాజకీయాల్లోకి రావొద్దని చిరు సలహా ఇచ్చారు. రాజకీయాల్లో విలువ ఉండదని చెప్పారు. అంతేకాదు రాజకీయాలంటే కేవలం డబ్బు మాత్రనే అని స్పష్టం చేశారు. మంచి చేద్దామని వచ్చినా.. చేసే అవకాశం ఉండదన్నారు. అందుకు తనకు జరిగిన రాజకీయ అనుభవమే ఉదాహరణ అన్నారు. ‘నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నెం.1 సినీ స్టార్‌గా ఉన్నాను. కానీ ఏం లాభం. నా సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయా. నా ప్రత్యర్థులు నన్ను ఓడించడానికి కోట్లలో డబ్బులు ఖర్చు పెట్టారు. జనసేనాని పవన్ కళ్యాణ్ విషయంలోనూ అదే జరిగింది. సో.. రజనీకాంత్, కమల్ హాసన్ లకు.. నా సలహా ఏంటంటే వారిద్దరూ రాజకీయాల్లోకి రాకపోవడమే బెటర్’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
చిరంజీవి ఇచ్చిన సలహాకు కమల్ హాసన్ కౌంటర్ ఇచ్చారు. తాను గెలుపోటముల కోసం రాజకీయాల్లోకి రాలేదు అన్నారు. మార్పు కోసం ప్రజల్లో చైతన్యం కోసం రాజకీయాల్లోకి వచ్చాను అని స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో ప్రజల ఆలోచనా ధోరణిపై తనకు అవగాహన పెరిగిందని కమల్ హాసన్ చెప్పారు. రాజకీయాలకు సంబంధించి చిరంజీవి తనకు ఏనాడు సలహాలు ఇవ్వలేదన్నారు.
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్.. మక్కల్ నీది మయ్యం పార్టీని నెలకొల్పిన సంగతి తెలిసిందే. తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటులో కూడా గెలవలేకపోయారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంకా రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టలేదు.
Also Read : పవన్ అందుకే ఓడాడు.. రాజకీయాలు చేయొద్దని కమల్, రజనీకి చిరు సూచన