నేను తప్పు అని నిరూపిస్తే, నా ‘పద్మశ్రీ’ అవార్డు తిరిగిచ్చేస్తా: కంగనా రనౌత్‌

  • Published By: vamsi ,Published On : July 19, 2020 / 08:06 AM IST
నేను తప్పు అని నిరూపిస్తే,  నా ‘పద్మశ్రీ’  అవార్డు తిరిగిచ్చేస్తా: కంగనా రనౌత్‌

Updated On : July 19, 2020 / 8:34 AM IST

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విషయంలో సినీనటి కంగనా రనౌత్‌తో సహా చాలా మంది నటులు గట్టిగా మాట్లాడుతున్నారు. కంగనా దీనిని కొద్ది రోజుల క్రితం ‘ప్రణాళికాబద్ధమైన హత్య’ గా అభివర్ణించింది.

ఈ క్రమంలోనే రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి వివరంగా మాట్లాడారు. ఈ మొత్తం విషయంపై తాను ఇప్పటివరకు చెప్పినది తప్పు అని నిరూపిస్తే తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేందుకు సిద్ధమని కంగనా ప్రకటించింది.

అదే సమయంలో, ఈ మొత్తం విషయంపై పోలీసులు ఏ విచారణ చేయాలని అనుకున్నా, వారికి తన మద్దతు ఇస్తారని ఆమె అన్నారు. “పోలీసులు తనకు సమన్లు ​​పంపారని, మీరు ఎవరినైనా పంపించి నా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి” అని రనౌత్ పోలీసులకు చెప్పినట్లు తెలిపారు.

కానీ ఆ తర్వాత పోలీసులు తనని సంప్రదించలేదని ఆమె అన్నారు. నేను ఇప్పటివరకు చెప్పినదాన్ని నిరూపించలేకపోతే, నా పద్మశ్రీ అవార్డును తిరిగి ఇస్తాను. నేను చెప్పినవన్నీ పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయని ఆమె అన్నారు.

మూడు జాతీయ అవార్డులతో పాటు, కంగనా రనౌత్‌కు ఈ ఏడాది ప్రారంభంలో పద్మశ్రీ లభించింది. ఇంతకుముందు కంగనా మాట్లాడుతూ, బాలీవుడ్‌లో ఓ ముఠా ఉందని, ఆ ముఠానే సుశాంత్ మరణానికి కారణమని చెప్పారు.

ముంబై పోలీసులు మహేష్ భట్‌ను ప్రశ్నించడానికి ఎందుకు పిలవట్లేదని ఆమె ప్రశ్నించారు. కరణ్ జోహార్, రాజీవ్ మసంద్, ఆదిత్య చోప్రా, మహేష్ భట్ వాంగ్మూలాలను పోలీసులు తీసుకోవడం లేదని, ఎందుకంటే వారు శక్తివంతమైన వ్యక్తులు అని ఆమె అన్నారు.