ఎవరైతే ఏంటీ : సీఎం కారుకు ఫైన్

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే సీఎం అయినా.. సామాన్యుడు అయినా ఒక్కటే అంటున్నారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు.. ట్రాఫిక్ నిబంధనలు పాటించని కారణంగా కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి చెందిన రేంజ్ రోవర్ కారుపై జరిమానా విధించారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ పోలీస్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి నెలలో మొబైల్ వాడకం.. పరిమితికి మించిన వేగంతో వెళ్లిన కారణంగా కుమారస్వామి ప్రైవేటు కారుకు జరిమానా విధించారు.
Read Also : ‘లక్ష్మీస్ ఎన్‌టీఆర్’ విడుదల వాయిదా: ప్రకటించిన వర్మ
ఇందులో ఒకటి రూ.300 కాగా మరో చలాన్ రూ.600గా ఉంది. ఈ రెండు రోజుల్లోనూ కుమారస్వామి బెంగళూరులోనే ఉన్నారు. కారుపై ఫైన్‌ను ఆటోమేటిక్ కెమెరాలను అనుసరించి ట్రాఫిక్ పోలీసులు వేశారు. కాగా కారుపై ఫైన్‌కు సంబంధించిన కస్తూరి మీడియా ప్రయివేటు లిమిటెడ్‌కు పంపినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలపారు. కుమారస్వామి వాడే రేంజ్ రోవర్ కారు కస్తూరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీదే ఉండడంతో ఆ కంపెనీకి నోటీసులు వచ్చాయి. ఇదిలా ఉంటే కుమార స్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటకీ ఎప్పుడూ అధికారిక వాహనం వినయోగించలేదు. అన్ని అధికారిక కార్యక్రమాలకు తన సొంత కారులోనే వెళ్తుంటారు.
CAR DETAILS:
KA-42-P-0002
(Ramanagar RTO,KA)
Owner:1-KASTHURI MEDIA PVT LTD
Vehicle:RANGE ROVER 4.4L TD(DIESEL)
Motor Car (LMV)