Praveen Sood : సీబీఐ కొత్త డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్.. అసలు ఎవరీ ప్రవీణ్ సూద్

Praveen Sood : ప్రవీణ్ సూద్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1986 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సూద్.

Praveen Sood : సీబీఐ కొత్త డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్.. అసలు ఎవరీ ప్రవీణ్ సూద్

Praveen Sood

Updated On : May 14, 2023 / 5:36 PM IST

CBI Director Praveen Sood : సీబీఐ కొత్త డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్ ని నియమించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం కర్నాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్ కు సీబీఐ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రవీణ్ సూద్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1986 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సూద్. 2020 జనవరి నుంచి కర్నాటక డీజీపీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయనకు సీబీఐ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించింది కేంద్రం.

కర్నాటక డీజీపీగా పని చేస్తున్న ప్రవీణ్ సూద్ ని సీబీఐ కొత్త డైరెక్టర్ గా హైలెవెల్ కమిటీ సూచించింది. ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా లోక్ సభలో ప్రతిపక్ష నేత.. సీబీఐ డైరెక్టర్ ను ఎంపిక చేస్తారు. ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్ గా సుబోధ్ కుమార్ జైస్వాల్ ఉన్నారు. ఆయన పదవీ కాలం మే 25న ముగుస్తుంది.

Also Read..Karnataka: ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? ఫలితాలు ఎలా వచ్చాయి?

ఆ తర్వాత సీబీఐ డైరెక్టర్ బాధ్యతలను ప్రవీణ్ సూద్ తీసుకోబోతున్నారు. సీబీఐ డైరెక్టర్ నియామకం పూర్తి పాదర్శకంగా ఉంటుంది. ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్ సభ ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ.. సీబీఐ డైరెక్టర్ ను ఎంపిక చేయడం జరుగుతుంది. సీనియార్టీ ప్రకారం.. ప్రవీణ్ సూద్ ని సీబీఐ కొత్త డైరెక్టర్ గా నియమించారు.

ప్రవీణ్ సూద్ గురించి తెలుసుకోవాల్సిన 5 విషయాలు..
* ప్రవీణ్ సూద్ ఢిల్లీ ఐఐటీ గ్రాడ్యుయేట్
* 1986 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్
* తన కెరీర్ ని అసిస్టెంట్ గా ప్రారంభించారు. 1989లో మైసూరు ఎస్పీగా పని చేశారు. బళ్లారి, రాయచూర్ ఎస్పీగా పని చేశారు.
* ఆ తర్వాత బెంగళూరు సిటీ లా అండ్ ఆర్డర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా నియామకం.
* ప్రవీణ్ సూద్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో విస్తృతమైన వృత్తిని కలిగి ఉన్నారు. ముఖ్యమైన పదవుల్లో పని చేశారు.

Also Read..Karnataka: కాంగ్రెస్‌ను గెలిపించిన “అతడు”.. తెలంగాణలోనూ గెలిపిస్తాడా?.. ఎవరీ శక్తిమంతుడు?