ప్రేమికుల రోజున : ఒక్కటైన IAS జంట

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 09:23 AM IST
ప్రేమికుల రోజున : ఒక్కటైన IAS జంట

వాళ్లిద్దరు ఐఏఎస్ అధికారులు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జీవితాంతం గుర్తుండిపోయేలా పెళ్లి చేసుకోవాలని అనుకున్న వారు.. అందుకు ప్రేమికుల రోజుని ఎంచుకున్నారు. 2019, ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల రోజున IAS అధికారుల జంట పెళ్లి చేసుకున్నారు. కేరళ అమ్మాయి..ఆంధ్ర అబ్బాయి వివాహబంధంతో ఒక్కటయ్యారు.

 

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన గౌతం 2008లో జాతీయ స్థాయిలో సివిల్స్ 23వ ర్యాంక్‌ను సాధించారు. ప్రస్తుతం ఆయన  కర్ణాటకలో పనిచేస్తున్నారు. దావరణగెరె జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అదే జిల్లాలో సంచాయితీ CEOగా పనిచేస్తున్న కేరళకు చెందిన ఆశ్వథితో గౌతం ప్రేమలో పడ్డారు. వీరి లవ్ మ్యాటర్‌లో మరో IAS అధికారి ఇరు కుటుంబాల మధ్య మధ్యవర్తిత్వం వహించారు. దీంతో ఈ పెళ్లికి రెండు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపారు. వీరి వివాహం కాలికట్‌లో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య వైభవంగా జరిగింది.