ఆపరేషన్ లోటస్ : బీజేపీ నయా ప్లాన్

కర్నాటక : బిజెపి తన పట్టు వీడటం లేదు..ఆపరేషన్ లోటస్ అంటూ చేసిన ప్రయత్నం తుస్సుమన్నా..అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామంటూ కొత్త ప్లాన్ వేసింది. దీనికి తోడు కాంగ్రెస్ కూడా పూర్తిగా సెల్ఫ్ డిఫెన్స్ గేమ్ ఆడుతుండటం..బిజెపి ప్రయత్నాలకు బలం చేకూర్చుతోంది. ఇంకా రిసార్ట్ స్ట్రాటజీనే అమలు చేస్తూ..ఎమ్మెల్యేలను కాపాడుకునేపనిలో పడింది.
బిజెపి నో కాన్ఫిడెన్స్ మోషన్‌ని ముందుకు తెస్తోంది. దీంతో తమవైపు వచ్చే ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా..ఓటేస్తారనే ధీమాలో ఉంది. మూడు రోజుల వ్యవధిలో మూడుసార్లు కాంగ్రెస్ సీఎల్పీ భేటీలు నిర్వహించింది. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం ఫుల్ ధీమాగా ఉన్నారు. సర్కార్‌కి వచ్చిన ఢోకా ఏమీ లేదని ఢంకా భజాయించి చెబుతున్నారు. ఇక బిజెపి టెంట్‌లో దూకేందుకు..కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్ జార్కిహోళి, ఉమేష్ జాదవ్, మహేష్ కుమటహళ్లి, నాగేంద్ర సిధ్దంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
శాసనసభలో మొత్తం 224 మంది సభ్యులు ఉన్నారు.
బీజేపీకి 104 మంది, కాంగ్రెస్‌కు స్పీకర్‌తో కలిపి 80మంది, ఇద్దరు ఇండిపెండెంట్‌లు, ఒక బీఎస్పీ ఎమ్మెల్యే ఉన్నారు.
ఇద్దరు ఇండిపెండెంట్‌లు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నాక సంకీర్ణ పాలకుల బలం 118కి పడిపోయింది. మరో నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే బలం 114కు తగ్గిపోనుంది.