BJP Bharati Shetty : మహిళలు నైట్ డ్యూటీలు చేయటానికి అనుమతించవద్దు : బీజేపీ మహిళా నేత

 కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ భారతి శెట్టి మహిళా ఉద్యోగినుల భద్రత గురించి మాట్లాడిన మాటలు వివాదంగా మారాయి. రాత్రివేళల్లో పనిచేస్తున్న మహిళలు లక్ష్యంగా నేరాలు జరుగుతున్నాయని అన్నారు.

BJP Bharati Shetty : మహిళలు నైట్ డ్యూటీలు చేయటానికి అనుమతించవద్దు : బీజేపీ మహిళా నేత

Bjp Mlc Bharati Shetty

Updated On : September 23, 2021 / 4:32 PM IST

BJP MLC Bharati Shetty: మహిళలు భద్రత. ఈ విషయం ఎంత సున్నితమో..అంత వివాదం కూడా. ఈక్రమంలో కొన్ని వ్యాఖ్యలు వివాదంగా మారుతుంటాయి. ముఖ్యంగా రాజకీయనేతలు మాట్లాడే సమయంలో ఏ ఉద్ధేశ్యంతో మాట్లాడినా అది ఎటువైపు దారి తీస్తుందో చెప్పలేం. ఈక్రమంలో బీజేపీ మహిళా నేత మహిళా ఉద్యోగినుల భద్రత గురించి మాట్లాడిన మాటలు వివాదంగా మారాయి. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ భారతి శెట్టి రాత్రివేళల్లో పనిచేస్తున్న మహిళలు లక్ష్యంగా నేరాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మహిళా ఉద్యోగినుల భద్రత కోసం రాత్రి సమయాల్లో వారికి ఓవర్ టైం పనిచేయడానికి ఆయా కంపెనీలు అనుమతించవద్దని భారతిశెట్టి సూచించారు. ఆయా కంపెనీల్లో పనిచేసే మహిళలను ఓవర్ టైం పనిచేయించుకోవద్దని భారతి కోరారు.

Read more :Deeply Hurt By Own Word : నా మాటలే నన్ను గాయపరుస్తున్నాయి : ఉమాభారతి పశ్చాత్తాపం

బుధవారం మైసూర్ లో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన గురించి జరిగిన చర్చలో భారతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళలు భద్రత కోసం నైట్ డ్యూటీలు చేయటానికి ఆయా కంపెనీలు అనుమతించవద్దని ఆమె కోరారు. అంతేకాదు..నేరస్థుల్ని కఠినంగా శిక్షించటానికి న్యాయవ్యవస్థకు కోరలు లేవని..అందుకే నేరాలు బాగా పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు.నేరాలను నిర్మూలించడానికి కఠినతరమైన కొత్త చట్టాలు అవసరమని ఎమ్మెల్సీ భారతిశెట్టి అభిప్రాయపడ్డారు.

Read more :Uma Bharathi : మా చెప్పులు మోయడానికే అధికారులు పనికొస్తారు: ఉమాభారతి

దేశవ్యాప్తంగా మహిళల భద్రత పట్ల ప్రభుత్వాలు మరింత కఠిన చట్టాలు తీసుకురావల్సిన అవసరముందన్నారు.భారతిశెట్టి చేసిన వ్యాఖ్యలు మహాత్మాగాంధీ కల రామరాజ్య స్ఫూర్తితో లేవని..మహిళల భద్రత అన్ని సమయాల్లో ఉండేలా చూడాలని కాంగ్రెస్ నేత ఎస్ఆర్ పాటిల్ సూచించారు. భారతి చేసిన సూచన ఆచరణ సాధ్యం కాదని కాంగ్రెస్ చీఫ్ విప్ ఎం నారాయణస్వామి అన్నారు.