Kedarnath Yatra: భారీ వర్షాలతో నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్ యాత్రను నిలిపేస్తున్నట్లు ఉత్తరాఖాండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా సోమవారం, మంగళవారాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది.

Kedarnath Yatra: భారీ వర్షాలతో నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర

Kedarnath

Updated On : May 23, 2022 / 8:01 PM IST

Kedarnath Yatra: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్ యాత్రను నిలిపేస్తున్నట్లు ఉత్తరాఖాండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా సోమవారం, మంగళవారాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది.

రుద్రప్రయాగ్ సీఓ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. “కాలినడకన వెళ్తున్న భక్తులను ఆపేసి హోటల్స్ కు పంపించేశాం. ఇప్పుడే గుడి ఎక్కొద్దని భక్తులకు సూచించాం” అని అన్నారు.

గుప్తాక్షికి చెందిన దాదాపు 5వేల మందిని ఆపేశామని, హేలి సర్వీసులను కూడా నిలిపేసినట్లు వెల్లడించారు.

Read Also: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు: కరోనా ఆంక్షల నడుమ భక్తులకు అనుమతి

అంతకుముందు ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయని, పర్వతాలు తెల్లటి మంచుతో కప్పబడి ఉన్నాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. హిమపాతం కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఆ ప్రాంతమంతా విపరీతమైన చలి పెరిగిపోయింది.

ఆదివారం సాయంత్రం మంచు కురిసింది. ప్రజలు గొడుగుల క్రింద ఆశ్రయం పొందారు. అయినప్పటికీ చలిని సైతం లెక్కచేయకుండా సోమవారం దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.