మూడోసారి ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ : కొత్తగా ప్రమాణ స్వీకారం 

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.

  • Published By: veegamteam ,Published On : February 16, 2020 / 07:47 AM IST
మూడోసారి ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ : కొత్తగా ప్రమాణ స్వీకారం 

Updated On : February 16, 2020 / 7:47 AM IST

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్ తో ప్రమాణస్వీకారం చేయించారు. కేజ్రీవాల్‌ సీఎంగా మూడోసారి ప్రమాణం స్వీకారంచేశారు. కేజ్రీవాల్ తోపాటు ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లీట్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్రపాల్ గౌతమ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ధన్యవాద్ ఢిల్లీ పేరుతో కేజ్రీవాల్ ప్రమాణం స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ప్రఖ్యాత రామ్‌లీలా మైదానంలో  ప్రజల మధ్యలో కేజ్రీవాల్ ప్రమాణం స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ప్రజలు పెద్దఎత్తున హాజరు అయ్యారు.  

కాగా, ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులెవరికీ ఆహ్వానాలు పంపలేదు. వేదికపై కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వివిధ రంగాలకు చెందిన 50 మంది ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ‘ఢిల్లీ వాసులారా, మీ కుమారుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వచ్చి మీ కుమారుడిని ఆశీర్వదించండి’ అంటూ శనివారం కేజ్రీవాల్‌ పిలుపునివ్వడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో వరసగా మూడో మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ 62 సీట్లలో బీజేపీ 8 సీట్లలో విజయం సాధించింది.

అరవింద్ కేజ్రీవాల్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల్ని వీఐపీలుగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. పలువురు రాజకీయ ప్రముఖలు, ఉన్నతాధికారులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో… పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన సామాన్యులకు అత్యధిక ప్రాధాన్యం కల్పించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

పారిశుధ్య కార్మికులతో పాటు ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, మెట్రో రైలు డ్రైవర్లు, స్కూల్ ఫ్యూన్లు సహా 50 మంది వీఐపీయేతర వ్యక్తులు ముఖ్యమంత్రితో పాటు వేదికను పంచుకున్నారు. వీరితో పాటు మాస్కో ఒలింపియాడ్స్‌లో పతకాలు సాధించిన విద్యార్ధులు, విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల కుటుంబ సభ్యులు, అగ్నిమాపక సిబ్బందిని కూడా ఆహ్వానించారు.