Monkey Fever : దేశంలో మరో వైరస్ కలకలం.. తొలి కేసు నమోదు

దేశంలో మళ్లీ మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. కేరళ రాష్ట్రంలో ఈ ఏడాది తొలి మంకీ ఫీవర్ కేసు నమోదైంది.

Monkey Fever : దేశంలో మరో వైరస్ కలకలం.. తొలి కేసు నమోదు

Monkey Fever

Updated On : February 10, 2022 / 4:46 PM IST

Monkey Fever : ఓవైపు కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. థర్డ్ వేవ్ లో భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, కొన్ని రోజులుగా కోవిడ్ తీవ్రత తగ్గింది. పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. కరోనా తీవ్రత తగ్గిందని ఊపిరిపీల్చుకునే లోపు మరో వైరస్ కలకలం రేగింది. దేశంలో మళ్లీ మంకీ ఫీవర్ అలజడి రేపుతోంది. కేరళ రాష్ట్రంలో ఈ ఏడాది తొలి మంకీ ఫీవర్ కేసు నమోదైంది.

వయనాడ్​ జిల్లాలోని పనవళ్లీ గిరిజన ప్రాంతంలో 24 ఏళ్ల యువకుడికి మంకీ ఫీవర్ నిర్ధారణ అయ్యింది. తీవ్ర జ్వరంతో అతడు ఆస్పత్రిలో చేరాడు. మంకీ ఫీవర్​ లక్షణాలు కనిపించడంతో డాక్టర్లు టెస్టులు చేశారు. పరీక్షలో మంకీ ఫీవర్ కన్ ఫర్మ్ అయ్యింది.

Semaglutide Drug : ప్రపంచానికి గుడ్‌న్యూస్.. అధిక బరువును తగ్గించే సరికొత్త డ్రగ్.. ఇదో గేమ్‌ఛేంజర్..!

మనంతవాడీ మెడికల్ కాలేజీలో బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఏడాది కేరళలో మంకీ ఫీవర్​ కేసు నమోదవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే రెండేళ్ల క్రితం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర్ మండలం అరళగోడు గ్రామంలో మంకీ ఫీవర్‌తో 26 మంది మరణించారు. ఆ తర్వాత ఇలాంటి కేసులు వెలుగులోకి రాలేదు.

ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన వైరస్ వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి డెంగీ లక్షణాలు ఉంటాయి. 5 నుంచి 10 శాతం మరణాలు సంభవిస్తాయని సైంటిస్టులు తెలిపారు.

* క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్..(KFD) దీన్నే మంకీ ఫీవర్ అంటారు.
* ఇది క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్ వల్ల వస్తుందని డాక్టర్లు తెలిపారు.
* ఈ వైరస్, ప్రధానంగా కీటకాల ద్వారా వస్తుంది.
* కోతులు, మనుషులపై ప్రభావం చూపుతుంది.
* ఈ వ్యాధి సోకిన వారికి 12 రోజుల వరకు తీవ్ర చలి జ్వరం, తలనొప్పి, బాడీ పెయిన్స్ వంటి లక్షణాలు ఉంటాయి.
* ఈ వ్యాధి సోకిన వారిలో 3 నుంచి 5 శాతం మరణాల రేటు ఉంటుంది.

Instagram New Feature : ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. బల్క్ డిలీట్ మెసేజ్‌లు, కామెంట్లు అన్నింటికి ఒకటే..!

* మంకీ ఫీవర్..టిక్-బర్న్ వైరల్ హెమరేజిక్ వ్యాధి.
* ఇది మానవులకు, కోతులకు ప్రాణాంతకం.
* క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్ (ఫ్లావివిరిడే, ఫ్లావివైరస్ జాతికి చెందినది) ‘పేను’ జాతికి చెందినది.
* ఈ వ్యాధి పేను జాతుల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
* ముఖ్యంగా హేమోఫిసాలిస్ స్పినిగెరా(నల్లులు, గోమార్లు) ప్రధాన వ్యాప్తి కారణంగా పరిగణించబడుతుంది.
* చిన్న చిన్న ఎలుకలు, కోతులు, పక్షులు క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్ (KFDV) వ్యాప్తిలో భాగం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
* ఈ పేళ్లు, నల్లులు, గోమార్లు(బగ్స్) పశువుల ద్వారా ప్రయాణించి.. కేడీఎఫ్ వ్యాధిని మనుషులకు సోకేందుకు కారణం అవుతాయి.
* వైరస్ సోకిన బగ్ జంతువును గానీ, మనిషిని గానీ కరిచినప్పుడు ఆ వ్యాధి సంక్రమిస్తుంది.
* అయితే, మనుషులే ఈ వ్యాధికి డెడ్ ఎండ్ హోస్ట్‌లుగా నిపుణులు పేర్కొన్నారు.
* ఎందుకంటే మనుషుల నుంచి ఇతరులకు ఆ వైరస్ సోకదు.
* కేఎఫ్‌డీవీకి వ్యతిరేకంగా న్యూట్రలైజింగ్ యాంటీబాడీలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ వ్యాధి ప్రభావాన్ని తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

1957లో తొలిసారి బయటపడ్డ కేఎఫ్‌డీ..
KFD మొదటిసారిగా 1957లో కర్ణాటక రాష్ట్రంలోని క్యాసనూర్ ఫారెస్ట్‌లో బయటపడింది. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు ఈ వైరస్ వ్యాప్తి చెంది. 2012 నుంచి ప్రతి సంవత్సరం 500 లకు పైగా మంకీ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. KFD ద్వారా ప్రభావితమైన వారిలో 5 నుంచి 10% మంది బాధితులు రక్తస్రావ లక్షణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఐదేళ్లలో ఈ వ్యాధి కారణంగా కనీసం 340 మంది ప్రాణాలు కోల్పోయారు.

క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ ద్వారా ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో పని చేసే వారు ప్రభావితమవుతున్నారు. ఏడాది పొడవునా జంతువులను మేపే వారు, రైతులు, అటవీ సంపద కోసం అడవుల్లో కూలి పనులు చేసే వారు, తోటల్లో పనులకు వెళ్లే వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు.