గాల్లో నువ్వా-నేనా : మోడీ, రాహుల్ పతంగులకు ఫుల్ డిమాండ్

సంక్రాంతి పండుగ దగ్గరపడుతున్న సమయంలో గుజరాత్ లో నరేంద్రమోడీ, రాహుల్ గాంధీల ఫొటోలతో కూడిన పతంగులు గాల్లో నువ్వా-నేనా అన్న విధంగా పోటీ పసడి మరీ ఎగురుతున్నాయి. సంక్రాంతిని భారీగా సెలబ్రేట్ చేసుకొనేందుకు ఇప్పటికే గుజరాతీలు రెడీ అయిపోయారు. ఈ ఏడాది పండుగకు కొంచెం పొలిటికల్ టచ్ ఇచ్చారు గుజరాతీయులు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రతిబించేలా రాజ్ కోట్ మార్కెట్లలో పతంగులు కన్పిస్తున్నాయి. భేటీ బచావో భేటీ పడావో వంటి మెసేజ్ లతో కూడిన పతంగులు, ఐక్యతా విగ్రహ ఫొటోలతో కూడిన పతంగులను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మోడీ ఫొటోలతో ఉన్న పతంగుల కూడా అధికసంఖ్యలో సేల్ అవుతున్నాయని వ్యాపారులు తెలిపారు. ప్రతి ఏటా వివిధ రకాల పతంగులు మార్కెట్లోకి వస్తాయని, కానీ ఈ ఏడాది వెరైటీగా మోడీ, రాహుల్, ఐక్యతా విగ్రహ ఫొటోలతో కూడిన పతంగులు ఎక్కువగా మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయని, రాబోయో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ కైట్స్ బిజినెస్ కూడా రాజకీయ కోణంలో జరుగుతుందని వినియోగదారులు తెలిపారు. మకర సంక్రాంతిని తెలుగురాష్ట్రల్లోనే కాకుండా భారత్ లోని వివిధ రాష్ట్రాల్లో సెలబ్రేట్ చేస్తారు.