Former IPL Chairman Lalit Modi: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో లలిత్ మోడీ.. అక్సిజన్ సపోర్ట్‌పై చికిత్స

లలిత్ మోడీ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుపై మాజీ క్రికెటర్ హర్భన్ సింగ్ స్పందించాడు. త్వరగా కోలుకోండి అంటూ పేర్కొన్నాడు. బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితాసేన్ సోదరుడు రాజీవ్ సేన్ లలిత్ మోడీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. గతేడాది జులైలో సుస్మితా‌సేన్‌తో ఉన్న ఫొటోలతో వారిమధ్య అనుబంధాన్ని లలిత్ మోడీ ప్రకటించారు. సుస్మితను తన బెటర్‌హాఫ్ అని పిలిచాడు.

Former IPL Chairman Lalit Modi: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో లలిత్ మోడీ.. అక్సిజన్ సపోర్ట్‌పై చికిత్స

Lalit Modi

Updated On : January 14, 2023 / 12:18 PM IST

Former IPL Chairman Lalit Modi: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ సపోర్టుపై చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని లలిత్ మోడీ తన ఇన్‌స్టా‌గ్రామ్‌లో పేర్కొన్నారు. రెండు సార్లు తనకు కోవిడ్ ఇన్‌ఫెక్షన్ అయినట్లు, న్యూమోనియా తీవ్రంగా ఉన్న కారణంగా హాస్పిటల్‌లో చేరినట్లు లలిత్ మోడీ వెల్లడించాడు.

Lalit Modi: సుశ్మితా సేన్‌ను భార్యగా ప్రకటించిన లలిత్ మోదీ

ఇన్‌ప్లు‌ఎంజా, డీప్ న్యుమోనియాతోపాటు రెండువారాల్లో డబుల్ కోవిడ్‌తో మూడు వారాలు నిర్బంధంలో ఉండాల్సి వచ్చిందని మోడీ తెలిపాడు. తనకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు మెక్సికోలో ఉన్నానని, ఇప్పుడు ఇద్దరు వైద్యులు సహాయంతో ఎయిర్ అంబులెన్స్ ద్వారా లండన్ చేరుకున్నానని చెప్పాడు. ప్లయిట్ ప్రయాణం సజావుగా సాగింది. అయితే, తాను ఇంకా 24గంటలు బాహ్య ఆక్సిజన్‌పైనే ఉన్నానని అన్నారు. నేను కోలుకోవటానికి ఇంకా సమయం పడుతుందని, నేను అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Lalit Modi (@lalitkmodi)

లలిత్ మోడీ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుపై మాజీ క్రికెటర్ హర్భన్ సింగ్ స్పందించాడు. త్వరగా కోలుకోండి అంటూ పేర్కొన్నాడు. బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితాసేన్ సోదరుడు రాజీవ్ సేన్ లలిత్ మోడీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. గతేడాది జులైలో సుస్మితా‌సేన్‌తో ఉన్న ఫొటోలతో వారిమధ్య అనుబంధాన్ని లలిత్ మోడీ ప్రకటించారు. సుస్మితను తన బెటర్‌హాఫ్ అని పిలిచాడు. ఇటీవలకాలంలో అతను సుస్మితతో ఉన్న తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫొటోను, ఆమె గురించి లైన్ ఉన్న తన బయోని కూడా మార్చాడు. దీంతో వారి మధ్య బ్రేకప్ అయినట్లు వార్తలు వచ్చాయి.