మోడీ ర్యాలీపై లాలూ సెటైర్లు : ఆ మాత్రం జ‌నాలు పాన్ షాపు ద‌గ్గ‌ర కూడా వ‌స్తారు

  • Published By: raju ,Published On : March 3, 2019 / 12:41 PM IST
మోడీ ర్యాలీపై లాలూ సెటైర్లు : ఆ మాత్రం జ‌నాలు పాన్ షాపు ద‌గ్గ‌ర కూడా వ‌స్తారు

Updated On : March 3, 2019 / 12:41 PM IST

 బీహార్ రాజ‌ధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఆదివారం(మార్చి-3,2019)  ప్ర‌ధాని మోడీ,సీఎం నితీష్ కుమార్ లు నిర్వ‌హించిన  సంకల్ప్ ర్యాలీపై ఆర్జేడీ అధినేత లాలూప్ర‌సాద్ యాద‌వ్ సెటైర్లు వేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ,సీఎం నితీష్ కుమార్,ఎల్ జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ లు ముగ్గురు క‌లిసి గాంధీ మైదాన్‌లో ర్యాలీ కోసం నెల‌లు త‌ర‌బ‌డి ప‌నిచేశారని,.ప్ర‌భుత్వ వ‌న‌రులు కూడా బాగా ఉప‌యోగించుకున్నారని, జ‌నాల‌ను త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశారని, ఇంత‌చేసినా ర్యాలీకి జ‌నాలను ర‌ప్పించ‌లేక‌పోయార‌ని,రోడ్డు పక్క‌న పాన్ షాపు ద‌గ్గ‌ర కూడా తాను ఆ మాత్రం ఆక‌ర్ఫించ‌గ‌ల‌న‌ని లాలూ ట్వీట్ చేశారు. ర్యాలీ నిర్వాహ‌కులు తెలివిగా కెమెరా క‌ద‌లిక‌ల‌ను ఉప‌యోగించుకుని చాలా పెద్ద సంఖ్య‌లో జ‌నం వ‌చ్చిన‌ట్లు చూపించారని, ఇలాంటి ప‌నులు చేసి జనాల‌ను మోస‌గించ‌లేర‌ని లాలూ సెటైర్లు వేశారు. బీహార్ ప్ర‌జ‌లు మోడీని తిర‌స్క‌రించార‌ని అన్నారు.
అంత‌కుముందు సంక‌ల్ప్ ర్యాలీలో లూలూపై మోడీ విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. బీహార్‌లో దాణా పేరుతో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనంటూ ఆర్జేడీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. దశాబ్దాలుగా దేశంలో కొనసాగుతున్న అవినీతి, దళారీల సంస్కృతికి తాము సాహసంతో చరమగీతం పాడామని చెప్పారు.