Lalu vs BJP: ఒక్క సభతో అటెన్షన్ గ్రాబ్ చేసిన ఇండియా కూటమి

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, అనురాగ్ ఠాకూర్ సహా పలువురు నేతలు ట్విట్టర్‌లో తమ బయోను మార్చుకున్నారు.

Lalu vs BJP: ఒక్క సభతో అటెన్షన్ గ్రాబ్ చేసిన ఇండియా కూటమి

Lalu vs BJP

ఒక్క సభతో అటెన్షన్ గ్రాబ్ చేసింది ఇండియా కూటమి. పట్నాలో జరిగిన జన్‌ విశ్వాస్‌ మహా ర్యాలీలో ఓవైపు మోదీని.. మరోవైపు బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ను మడతపెట్టారు నేతలు. అయితే అందరు మాట్లాడింది ఒకెత్తు. ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ స్పీచ్ మరో ఎత్తు. ఆయన కామెంట్స్ ఒక్కసారిగా డైలాగ్ వార్ కు దారి తీశాయి.

నితీశ్ కుమార్ కూటమి నుంచి బయటికి వచ్చిన తర్వాత.. జనవిశ్వాస్‌ పేరుతో తొలి ఎన్నికల బహిరంగ సభ నిర్వహించింది ఇండియా కూటమి. ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జునఖర్గే, రాహుల్ గాంధీ కూడా హాజరైన మహార్యాలీలో మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు లాలూ. మోదీ అసలు హిందువే కాదని మండిపడ్డారు. మోదీ తన తల్లి చనిపోతే హిందూ సంప్రదాయాల ప్రకారం గుండు చేసుకోలేదని విమర్శించారు. ఎక్కువ సంతానం ఉన్నవాళ్లను కూడా మోదీ తరచూ విమర్శిస్తుంటారని లాలూ ఆరోపించారు.

కుటుంబం లేదంటూ..
ప్రధాని నరేంద్ర మోదీకి కుటుంబం లేదంటూ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన కామెంట్స్ తో రాజకీయం వేడెక్కింది. బీజేపీ లీడర్లు అటాకింగ్ కు దిగారు. ప్రధాని నరేంద్రమోదీకి మద్దతుగా ఆ పార్టీ నేతలంతా ఒక్కటై.. ఆ విషయం పై స్పందించారు. బీజేపీ సీనియర్ నేతలు, మంత్రులందరూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో తమ పేర్లకు ముందు మోదీ కా పరివార్ అని చేర్చుకున్నారు.

ఆదిలాబాద్‌లో బహిరంగ సభలో ప్రధాని మోదీ కూడా లాలూ ప్రసాద్ యాదవ్‌ కామెంట్స్ పై ఎదురుదాడికి దిగారు. 140 కోట్ల మంది దేశప్రజలు తన కుటుంబమని కౌంటర్ ఇచ్చారు మోదీ. దేశంలోని ప్రతి పేదవాడూ తన కుటుంబమని.. ఎవరూ లేనివారు కూడా మోదీకి చెందివారు, మోదీ వారికే చెందుతారన్నారు. భారతదేశం తన కుటుంబమని..తాను ప్రజల కోసమే జీవిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. మై హూ మోదీ ప‌రివార్ అని స‌భ‌కు వ‌చ్చిన ప్రజ‌ల‌తో ప‌లికించారు మోదీ.

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, అనురాగ్ ఠాకూర్ సహా పలువురు నేతలు ట్విట్టర్‌లో తమ బయోను మార్చుకున్నారు. నేతలంతా తమ ప్రొఫైల్ లో మోదీ కా పరివార్ అని రాసుకున్నారు. అదే సమయంలో ప్రధానిపై అనుచిత వ్యాఖ్యల కేసులో పట్నాలోని గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మొత్తంగా లాలూ కామెంట్స్‌ ఎలక్షన్‌ హీట్‌ను మరింత పెంచాయి.

Kodali Nani: చంద్రబాబు, పవన్‌పై కొడాలి నాని హాట్ కామెంట్స్