చంద్రబాబు, పవన్‌పై కొడాలి నాని హాట్ కామెంట్స్

చంద్రబాబు ఒక్కడే వస్తే గెలవడని తెలిసి దత్తపుత్రుడిని తెచ్చుకున్నారని ఆరోపించారు. తన వర్గానికి 30 సీట్లు..

చంద్రబాబు, పవన్‌పై కొడాలి నాని హాట్ కామెంట్స్

Kodali Nani

Kodali Nani: ప్రతిపక్ష పార్టీలపై మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన సిద్ధం సభలో కొడాలి నాని మాట్లాడుతూ… ఇక్కడ ఐదేళ్లలో కనిపించని అభివృద్ధి రాజమండ్రి ఎంపీగా భరత్ గెలిచిన తర్వాతే అయిందని చెప్పారు.

చంద్రబాబుకు ఒక పక్క దద్దపుత్రుడు, మరోపక్క ఉత్త పుత్రుడు, మరోపక్క బీజేపీ వదినమ్మ, ఇంకో పక్క కాంగ్రెస్ చెల్లెమ్మ ఉన్నారని ఎద్దేవా చేశారు. వారిని తిట్టేందుకు ఈ రాష్ట్రంలో తాను, పేర్ని నాని, భరత్, ఇంకో పది మంది ఉన్నామని, అయినా వాళ్లలో మార్పు లేదని చెప్పారు.

చంద్రబాబు ఒక్కడే వస్తే గెలవడని తెలిసి దత్తపుత్రుడిని తెచ్చుకున్నారని ఆరోపించారు. తన వర్గానికి 30 సీట్లు ఇచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. 20 శాతం సామాజిక వర్గం ఉన్న పవన్ కల్యాణ్‌ మొత్తం కలిపి 24 సీట్లతో సరి పెట్టుకున్నారని చెప్పారు.

అదే సామాజిక వర్గం వారు, జన సైనికులు త్వరలోనే చంద్రబాబుని పాతాళానికి తొక్కబోతున్నారని అన్నారు. వెన్నుపోటు పొడిచే వారితో పవన్ కల్యాణ్ ప్రయాణం చేస్తున్నారని అన్నారు. పవన్ ను కాపాడుకోవాలంటే బాబుని ఒడించాలని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్సీ ఆది రెడ్డికి సిద్ధం సభలో ఎంపీ భరత్ రామ్ సవాల్ విసిరారు. వడ్డీ వ్యాపారం చేసి ఆది రెడ్డి రూ.కోట్లు సంపాదించారని ఆరోపించారు. రాజమండ్రిలో అడ్డదారులు తొక్కి ఆర్థికంగా ఎదిగారన్నారు. వాలంటీర్లు అందరూ తన తోబుట్టువులని, వారి జోలికి వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

2 కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జగన్ వైజాగ్ వస్తున్నారు: పూర్తి వివరాలు తెలిపిన మంత్రి గుడివాడ