లాలూ లైఫ్ డేంజర్ లో ఉంది

  • Published By: venkaiahnaidu ,Published On : April 20, 2019 / 04:14 PM IST
లాలూ లైఫ్ డేంజర్ లో ఉంది

Updated On : April 20, 2019 / 4:14 PM IST

ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ లైఫ్ చాలా డేంజర్ లో ఉందని ఆయన భార్య,బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ శనివారం(ఏప్రిల్-20,2019) సంచలన వ్యాఖ్యలు చేశారు.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లాలూను కలిసేందుకుతన కుమారుడు తేజస్వీ యాదవ్ వెళినప్పుడు అనుమతి నిరాకరించి తేజస్వీని లాలూని కలవనీయకుండా వెనక్కి పంపిచడం దారుణమన్నారు.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి లాలూకు విషం ఇచ్చి చంపాలని అనుకుంటే, లాలూ కుటుంబం మొత్తాన్ని చంపాలనుకుంటే వాళ్లు ఆ పని చేయగలరని కానీ ఈ నియంతృత్వం  పనిచేయనీయదని రబ్రీ దేవి అన్నారు.లాలూకు ఏదైనా జరిగితే బీహర్‌, జార్ఖండ్‌ ప్రజలు రోడ్లపైకి వస్తారని,చూస్తూ ఊరుకోబోరని ఆమె హెచ్చరించారు.అనారోగ్యంతో రిమ్స్ లో చేరిన లాలూను శనివారం కలిసేందుకు వెళ్లిన తనను బీజేపీ ప్రభుత్వం అడ్డుకుందని తేజస్వీయాదవ్ ఆరోపించారు.