Himachal Pradesh : నన్ను దింపురా బాబు..రూ. 1000 ఇస్తా, పారా గ్లైడింగ్ లో మహిళ..వీడియో వైరల్

పారా గ్లైడింగ్..మహిళకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది...

Himachal Pradesh : నన్ను దింపురా బాబు..రూ. 1000 ఇస్తా, పారా గ్లైడింగ్ లో మహిళ..వీడియో వైరల్

Land Kara De

Updated On : March 17, 2021 / 7:07 PM IST

Another Failed Paragliding Video : పారా గ్లైడింగ్ నుంచి కిందకు దింపేయండి..వామ్మో..భయ్యా..ల్యాండ్ అవుదాం..ఎక్కువగా డబ్బులు ఇస్తా..దించేయ్ అంటూ..ఓ వ్యక్తి ఏడుస్తూ..చెప్పాడు. భయంతో కేకలు పెట్టిన ఈ వీడియో నవ్వులు పూయించిన సంగతి తెలిసిందే. తాజగా..ఓ మహిళకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ ఘటన కూడా హిమాచల్ ప్రదేశ్ లోనే చోటు చేసుకోవడం గమనార్హం. ఖజ్జర్ పట్టణంలో చోటు చేసుకున్న ఈ వీడియోను Incredible_Himalya పేరిట ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు అయ్యింది.

వీడియోలో తొలుత మహిళ రైడింగ్ కోసం సిద్ధమౌతున్నట్లు కనిపించింది. ప్రారంభమైన క్షణం నుంచే ఆమె అరవడం వినిపించింది. ఓ మమ్మీ..భయ్యా..జల్ది ఉతార్ దో అంటూ హిందీలో ఆమే వేడుకోంది. ఊరుకోవాలని..దింపుతానని గ్లైడింగ్ చేపట్టిన వ్యక్తి చెప్పాడు. నేల మీదకు తీసుకరావాలని కోరుతూనే ఉంది. నా చేతులు..కాళ్లు వణుకుతున్నాయి..మీకు కావాలంటే..నేను..మీకు..రూ. 1000 ఇస్తానని చెప్పడం వినిపించింది. ఇక ల్యాండ్ అయ్యేటప్పుడు మరింతగా భయపడిపోయింది. భయ్యా..ధీరే చలావ్..అరిచింది. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.