భారీగా తగ్గనున్న ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీల ధరలు

భారీగా తగ్గనున్న ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీల ధరలు

Updated On : September 18, 2019 / 11:14 AM IST

మరికొద్ది రోజుల్లో భారత్‌లో ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీల ధరలు భారీగా తగ్గనున్నాయి. మంగళవారం ప్రభుత్వం దిగుమతి సుంకాలను 5శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎల్ఈడీల, ఎల్సీడీ టీవీలు తయారుచేసేందుకు వాడే టీవీ ప్యానెల్‌ను దిగుమతి చేసుకోవడానికి కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. గతంలో 7.5శాతంగా ఉన్న కస్టమ్స్‌ డ్యూటీని ప్రభుత్వం 15శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఆ సుంకాన్ని5శాతంకు చేర్చారు. 

దేశీయ తయారీలను ప్రోత్సహించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం.. ‘ఓపెన్ బ్యాటరీ, 15.6 అంగుళాల కంటే పైన, లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే(ఎల్సీడీ), లైట్ ఎమిటింగ్ డయోడ్(ఎల్ఈడీ)ల టీవీల ప్యానెల్‌లు భారీగా తగ్గనున్నాయి’ అని తెలిపారు.

2017లోనూ ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని 5శాతానికి తగ్గించారు. పలువురు టీవీ తయారీదారులు కన్జూమర్ ఎలక్టానిక్స్ అండ్ అప్లియన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్‌లు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకోకూడదని నిర్ణయాలను వెనక్కితీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. టీవీ తయారీలో ఓపెన్ సెల ప్యానెల్ అనేది చాలా కీలకం. టీవీలో సగం ఖరీదు దీనికే వెచ్చించాల్సి ఉంటుంది.